BigTV English

Tata Curvv Launch Date: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ రేంజ్..!

Tata Curvv Launch Date: లాంచ్‌కు సిద్ధమైన టాటా కర్వ్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ రేంజ్..!

Tata Curvv Launching on August 7th: టాటా మోటర్స్ భారత మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటూ బలోపేతం అవుతుంది. ఈ క్రమంలో కంపెనీ మరో పవర్ ‌ఫుల్ వెహికల్ లాంచ్ చేయనుంది. టాటా వచ్చే నెల 7వ తేదీన కర్వ్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఎస్‌యూవీని నెక్సాన్ ఆధారంగా రూపొందించారు. దీని డిజైన్, బాడీ లాంగ్వేజీ కూడా నెక్సాన్‌ను పోలి ఉంటుంది. టాటా ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీని 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇప్పుడు కంపెపీ దీనిని ఆగస్టు 7న ఈ ఎస్‌యూవీ విడుదల చేస్తున్నట్లు ధృవీకరించింది. ఈ కారులో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కూపే ఎస్‌యూవీ పెట్రోల్, ఈవీ రెండు వెర్షన్లలో విడుదల కానుంది. గత వారం కంపెనీ టాటా కూపే ఎస్‌యూవీ టీజర్ విడుదల చేసింది.


టాటా కర్వ్ డిజైన్ ఇటీవల విడుదల చేసిన హారియర్, సఫారి, నెక్సాన్, పంచ్ ఈవీ వంటి ఎస్‌యూవీలను పోలి ఉంటుంది. ముందు భాగంలో అట్రాక్డ్ ఎల్‌ఈడీ స్ట్రిప్, బాటమ్‌లో ట్రైయాంగిల్ క్లస్టర్, లోపల్ డ్యూయల్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. అలానే కనెక్ట్ చేయబడిన ఎల్‌ఈడీ స్ట్రిప్ కారు బ్యాక్ పార్ట్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా వైడ్ ట్రాక్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్ ఉన్నాయి.

టాటా కర్వ్ ఫీచర్స్
టాటా కర్వ్‌ను కాన్సెప్ట్ ఇమేజ్‌లో చూస్తే ఇంటీరియర్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులో మధ్యలో ఒక సెంట్రల్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కలిగి ఉంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ టచ్ కంట్రోల్‌లతో కూడిన కొత్త టై స్పోక్ స్టీరింగ్ వీల్‌తో లింకై ఉంటుంది. సేఫ్టీ కోసం టాటా కర్వ్ టూ అడాస్ సూట్ ఫీచర్ కలిగి ఉంటుంది. వీటితో పాటుగా పవర్డ్ ఓఆర్‌వీఏమ్‌లు, ఆటో డిమ్మింగ్ ఐవీఆర్ఏమ్, 360 డిగ్రీ సరౌండింగ్ కెమెరా, పుష్-బటన్ స్టార్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.


Also Read: Upcoming Hybrid Cars: టాప్ లేచిపోద్ది.. యూత్ కోసం హైబ్రిడ్ కార్లు.. త్వరలోనే లాంచ్!

టాటా కొత్త జనరేషన్ 2 EV ఆర్కిటెక్చర్ Acti.ev ప్లాట్‌ఫారమ్‌పై తీసుకొస్తున్నారు. ఇది కర్వ్ ఎలక్ట్రిక్, ICE వెర్షన్‌లలో వస్తుంది. ఎలక్ట్రిక్ కర్వ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400-500 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ AMT, 7 స్పీడ్ డీసీటీ ఉండే అవకాశం ఉంది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×