BigTV English

kodandareddy Serious on Harishrao: హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డికి ఇది తెల్వదా..? : కోదండరెడ్డి

kodandareddy Serious on Harishrao: హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డికి ఇది తెల్వదా..? : కోదండరెడ్డి

kodhandareddy Serious on Harishrao: బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దేశంలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.


2014లో రైతులకు కాంగ్రెస్ ఒకే విడతలో మొత్తం రుణాలు మాఫీ చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ రుణమాఫీ ఎలా చేసిందో హరీశ్‌రావుకు, ప్రశాంత్‌రెడ్డికి తెల్వదా? అంటూ ప్రశ్నించారు. నేను సమిష్టి కుటుంబంలోని వ్యక్తి కాదు అని కమటీ ముందు ఇస్తే రుణమాఫీ ఉంటుందన్నారు. ప్రజల సొమ్ము దుబారా కాకూడదనే నిబంధనలను పెట్టామన్నారు. అందరికీ అర్థమయ్యేలా రుణమాఫీకి సంబంధించి తెలుగులోనే జీవో పెట్టినట్లు ఆయన చెప్పారు. అర్హులైనవారికి రుణమాఫీ కాకపోతే దానిని పరిష్కరించేందుకు యంత్రాంగం ఉందంటూ వారిపై మండిపడ్డారు. ఏదిఏమైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రుణమాఫీ చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులను ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవొద్దంటూ వారికి సూచించారు.

Also Read: కేసీఆర్ పిటిషన్.. సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే.. రైతు రుణమాఫీ మార్గదర్శాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డుల షరతులు ఎందుకుని ఆయన ప్రశ్నించారు. సంబంధిత బ్యాంకులు రేషన్ కార్డులు చూసి రుణం ఇచ్చారా? అంటూ నిలదీశారు. రేషన్ కార్డులో విడిపోయినంత మాత్రాన రుణమాఫీకి అర్హులు కారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు రుణమాఫీకి ఇన్ని షరతులు ఎందుకని హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి అన్నారు. వీరి వ్యాఖ్యలపై కోదండరెడ్డి స్పందించారు. పైన పేర్కొన్న విధంగా ఆయన వివరణ ఇచ్చారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×