E-Paper
Advertisement

Gangs of Godavari Lyrical Song: లోకమంతా బ్యాడ్.. లోకులంతా బ్యాడ్ అంటున్న మాస్ కా దాస్!

Gangs of Godavari Lyrical Song: లోకమంతా బ్యాడ్.. లోకులంతా బ్యాడ్ అంటున్న మాస్ కా దాస్!
Advertisement

Vishwak Sen’s ‘Gangs of Godavari’ Movie Lyrical Song: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ గౌర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి.

మే 17 న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన మే 31 న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్.. ఒకపక్క వరుస ఇంటర్వ్యూలు ఇస్తూనే ఇంకోపక్క సినిమాలోని మిగిలిన లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బ్యాడ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Advertisement

ప్యూర్ మాస్ సాంగ్ అంటే ఇదే అనిపించేలా లిరిక్స్ ఉన్నాయి. ఇక అన్నింటికి మించి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, వాయిస్, ర్యాప్ నెక్స్ట్ లెవెల్. లంకల రత్న క్యారెక్టర్ ను ఈ సాంగ్ లో చూపించారు. లోకమంతా బ్యాడ్.. లోకులంతా బ్యాడ్.. ఏదైనా చేసినా బ్యాడ్.. ఏది చేయకపోయినా బ్యాడ్ అంటూ సమాజం మనిషిని ఎలా చూస్తుందో చెప్పుకొచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ ఒక లెవెల్ అయితే.. సాకీ లిరిక్స్ ను త్రివిక్రమ్ అందించడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి మే 31 న మాస్ కా దాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read: Ram Charan: దారుణం.. చరణ్ ను పట్టుకొని నలిపేసిన అభిమానులు.. వీడియో వైరల్

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×