E-Paper
Advertisement

Ram Charan: దారుణం.. చరణ్ ను పట్టుకొని నలిపేసిన అభిమానులు.. వీడియో వైరల్

Ram Charan: దారుణం.. చరణ్ ను పట్టుకొని నలిపేసిన అభిమానులు.. వీడియో వైరల్
Advertisement

Ram Charan: సాధారణంగా మనుషులకు ఒక కుతూహలం ఉంటుంది. సెలబ్రిటీలు ఎలా ఉంటారు. ఎలాంటి బట్టలు వేసుకుంటారు. ఎలాంటి ఫుడ్ తింటారు. ఇలాంటివి తెలుసుకొవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇక అదే సెలబ్రిటీలు ఎదురుగా కనిపిస్తే.. అస్సలు ఆగరు. వారిని తాకుతూ.. అసలు వారు మనుషులా కాదా అనేంతలా చెక్ చేస్తారు. ప్రస్తుతం పిఠాపురంలో రామ్ చరణ్ పరిస్థితి అలానే తయారయ్యింది. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం చేస్తున్న సంగతి తెల్సిందే.

జనసేనాని పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా పిఠాపురంలో ఆయనను గెలిపించాలని ఇప్పటివరకు మెగా హీరోలందరూ తమ ప్రచారాలు చేశారు. ఇక ఈరోజు ప్రచారం చివరి రోజు కావడంతో చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చాడు. ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ తరువాత కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించారు. ఇక రామ్ చరణ్ రావడంతో పితపురం జనసంద్రంగా మారింది. చరణ్ చుట్టూ అభిమానులు గుమిగూడారు.

Advertisement

అసలు లోపలికి కూడా పోనివ్వకుండా చరణ్ ను చూడడానికి ఎగబడ్డారు. ఇక వారందరిని దాటుకొని చరణ్ బయటకు రావడానికి చాలా కష్టపడ్డాడు. చుట్టూ ఉన్నా అభిమానులు.. అసలు చరణ్ మనిషా.. ? కాదా.. ? అన్నట్లు అతడిని తాకడానికి ప్రయత్నించడం విశేషం. చెప్పాలంటే పాపం.. చరణ్ ను అభిమానులు నలిపేశారు. షర్ట్  దొరికితే షర్ట్, చేతులు పట్టుకొని వెనక్కి లాగడం లాంటివి చేశారు. బౌన్సర్లు కూడా వారి మధ్య ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. దీంతో చరణ్ కొద్దిగా ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్.. అరేయ్ అతను మనిషే ఎందుకు ఇలా చేస్తున్నారు అని కొందరు. అసలు బౌన్సర్లు ఎక్కడ ఉన్నట్లు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఉంటుంది కాబట్టే హీరోలు బయటకు రారు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×