E-Paper
Advertisement

Good Bad Ugly Movie Twitter Review : గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ట్విట్టర్ రివ్యూ..

Good Bad Ugly Movie Twitter Review : గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ట్విట్టర్ రివ్యూ..
Advertisement

Good Bad Ugly Movie Twitter Review : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన నటిస్తున్న సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా బాగా ఆకట్టుకుంటాయి. అజిత్ సినిమాను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామని తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అజిత్ ‘గుడ్ బాడ్ అగ్లీ’ మూవీలో నటించాడు. ఆ మూవీ భారీ అంచనాలతో నేడు రిలీజ్ అయ్యింది. మరి ఆ సినిమా ఎలా ఉందో పబ్లిక్ ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం…

ట్రైలర్స్ తో ఈ మూవీ అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీ టైటిల్ పై ఫ్యాన్స్ బాగా స్పందిస్తున్నారు. అది టైటిల్ కార్డ్స్ నుంచి మొదలు అయ్యిందట. అజిత్ కెరియర్ మొత్తం మీద ది బెస్ట్ టైటిల్ కార్డ్ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు..

Advertisement

ఫస్ట్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు… సెకండ్ హాఫ్ కామెడీ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అజిత్ మాస్ డైలాగ్స్, ఆయన వేసే వన్ లైన్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఫుల్లుగా నవ్విస్తాయట. కథ కంటే కూడా అజిత్ హీరోయిజం మీద దర్శకుడు ఎక్కువ డిపెండ్ కావడంతో స్టోరీ పరంగా సగటు ప్రేక్షకులు కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది.. అజిత్ నుంచి ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ కి ఇది ఫుల్ మీల్స్ లెక్క బాగా ఆకట్టుకుంది. కమర్షియల్ హిట్ అవుతుందని ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

Advertisement

మూవీ మొదలైనప్పటి నుంచి మొదటి 20 నిమిషాల వరకు థియేటర్లలో పెద్ద హంగామే జరిగినట్లు తెలుస్తుంది. ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హీరో ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు అభిమానులకు కావాల్సిన అంశాలతో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ సినిమా చేశారట. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమా భారీ అంచనాలతో పాటు బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేలా కనిపిస్తుందని ట్వీట్ చేస్తున్నారు.

‘విడా ముయర్చి’తో అజిత్, త్రిష జంట డిజాస్టర్ అందుకుంది. అయితే ఆ సినిమా విడుదలైన రెండు నెలలలో ‘గుడ్ బాడ్ అగ్లీ’తో బ్యాక్ బౌన్స్ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమాకు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ వస్తుంది. భారీ అంచనాలతో వచ్చిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే రేంజ్ లో టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది. ఇక కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి..

ఈ మూవీలో అజిత్ కు జోడిగా త్రిష నటించింది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మైత్రి మేకర్స్ బ్యానర్‌లో వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు.. అజిత్ నుంచి ఆరేళ్ల తర్వాత వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని అందుకుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×