OTT Movie : ఇప్పుడు అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి వైపే చూస్తున్నారు. నచ్చిన సినిమాలను, దొరికిన సమయంలో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే గత ఏడాది రిలీజ్ అయిన ఒక తమిళ్ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ తమిళ డ్రామా మూవీ పేరు’కొట్టుక్కాలి’ (Kottukkaali). 2024 వచ్చిన ఈ మూవీకి పి.ఎస్. వినోత్‌రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూరి, అన్నా బెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ మీనా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. మీనా ఒక తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుంది. అందువల్ల ఆమె కుటుంబం ఆమెపై మంత్రం ప్రయోగం జరిగిందని అనుకుంటారు. ఈ మంత్రంను తొలగించడానికి, ఆమె మామయ్య అయిన పాండి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆమెను ఒక మాంత్రికుడు వద్దకు తీసుకెళ్తాడు. అసలు స్టోరీ అక్కడి నుంచే మొదలు అవుతుంది.’కొట్టుక్కాలి’ ఆగస్టు 23, 2024న థియేటర్లలో విడుదలైంది. 2024 సెప్టెంబర్ 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మీనా అనే అమ్మాయికి అతని బావ పాండి తో పెళ్లి చేయాలని అనుకుంటారు. అయితే మీనా చదువు కోవాలి అని చెప్పడంతో, చేసేదేం లేక కాలేజ్ లోజాయిన్ చేస్తారు. అక్కడ మీనా, ఒక తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తుంది. కానీ ఆమె కుటుంబం ఆమెను ప్రేమించిన అబ్బాయి మంత్రం వేశాడాని నమ్ముతారు. ఈ మంత్రాన్ని తొలగించడానికి, ఆమె మామయ్య అయిన పాండి , ఆమెకు నిశ్చితార్థం చేసిన వ్యక్తి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆమెను ఒక మాంత్రికుడు వద్దకు తీసుకెళ్తారు. ఈ ప్రయాణం ఒక రోడ్ ట్రిప్‌గా మొదలై, సాంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న ఉద్రిక్తతలను వెల్లడిస్తుంది. అయితే ఆమంత్రగాడు మీనాను అసభ్యంగా తాకుతాడు. మీనా తన నిశ్శబ్దంతో ఈ అణచివేత ధోరణికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. ఆమె కేవలం ఇందులో ఒకే ఒక డైలాగ్ మాట్లాడుతుంది. కానీ ఆమె హావభావాల ద్వారా తన నిరసనను అద్భుతంగా చెబుతుంది. మరోవైపు, పాండి తండ్రి మాటలకు విలువ ఇస్తూ ఉంటాడు. ఆ తరువాత ఆమె ప్రేమను అంగీకరించలేక పోతాడు. ఈ చిత్రం విశ్వాసం, కుల వ్యవస్థ, మానవ సంబంధాలను లోతుగా ఆలోచింపజేస్తుంది. ఒక ఎరుపు రంగు కోడిపుంజు, మీనా జీవితానికి సమాంతరంగా చూపబడుతుంది. ఇద్దరూ స్వేచ్ఛ కోసం పరితపిస్తారు కానీ ఒక వలయంలో చిక్కుకుంటారు. ఈ మూవీ నెమ్మదిగా సాగిపోతుంది. సంగీతం లేకుండా, సహజ శబ్దాలతో దీనిని తెరకెక్కించారు. చివరికి ఆమెకి నిజంగానే దెయ్యం పట్టిందా ? ఆమె పై మంత్ర ప్రయోగం ఎవరు చేశారు ? అనేది మూవీని చూసి తెలుసుకోండి.
Also Read : ఆంటీలనే టార్గెట్ చేసి చంపే కిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ కు బుర్ర బద్దలే