OTT Movie : సరికొత్త కథలతో మలయాళం సినిమాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. స్టోరీలను సింపుల్ గా ప్రజెంట్ చేయడంలో మలయాళం దర్శకులు ముందున్నారు. ఇప్పుడు ఈ సినిమాలను కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. థియేటర్లలో, ఓటీటీ లలో కూడా వీటి హడావిడి నడుస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక వ్యక్తి ఆంటీలను వలలో వేసుకుని పనికానిస్తుంటాడు. ఆ తరువాత అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది అనే వివరాల్లోకి వెళితే…
సైనా ప్లే (Saina Play) లో
ఈ రొమాంటిక్ మలయాళ డ్రామా మూవీ పేరు ‘మార్జార ఒరు కల్లువచ్చ నున’ (Maarjaara Oru Kalluvacha Nuna). 2020 లో విడుదలైన ఈ సినిమాకు రాకేష్ బాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ శాంతను అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక దొంగ, మహిళలను మోసం చేసి ఇళ్లలో దొంగతనం చేస్తుంటాడు. చివరి వరకూ ఈ మూవీ సరదాగా సాగిపోతుంది. సైనా ప్లే (Saina Play) ఓటీటీ లో ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
శాంతను అనే వ్యక్తి తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. అతను ఆంటీలను ప్రేమ పేరుతో వలలో వేసుకుంటాడు. అయితే డబ్బున్న ఆంటీలతో మాత్రమే అలా చేస్తాడు. ఆ తరువాత వారి ఇళ్లలో దొంగతనం చేస్తుంటాడు. ఇలా చాలా మందికి షాక్ ఇస్తాడు. అయితే, ఒక దొంగతనం సమయంలో జరిగిన ఊహించని సంఘటన కారణంగా, అతను తన ఊరిని విడిచి పారిపోవాల్సి వస్తుంది. అతను నగరం శివారులోని ‘ఆశ్రమం వీడు’ అనే ఒక ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. ఈ ఇంటికి ఒక రహస్యమైన చరిత్రను కలిగి ఉంటుంది. అక్కడ ఉండే సమయంలో, శాంతను కొన్ని రహస్యమైన, అసాధారణ సంఘటనలు ఎదుర్కొంటాడు. ఈ సినిమా రామాయణంలోని అహల్య మోక్షం కథకు, ఆధునిక స్టోరీని జోడిస్తూ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్ జానర్‌ల మిశ్రమంగా తెరకెక్కింది. శాంతను ‘ఆశ్రమం వీడు’లో అహల్య, చిత్తి, ఇతర పాత్రలతో ఎదుర్కొనే సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయి.
అహల్య భర్తగా హరీష్ పెరడి, పోలీసు ఆఫీసర్‌గా టిని టామ్, ఇతర ముఖ్య పాత్రల్లో సుధీర్ కరమన నటించారు. ఈ స్టోరీలో శాంతను అతని గతంతో పాటు, ‘ఆశ్రమం వీడు’ రహస్యాలను వెలికితీసే ప్రయత్నం చేస్తాడు. అక్కడ కూడా అతను చిక్కుల్లో పడతాడు. చివరికి శాంతను ఆ రహస్యాలను ఛేదిస్తాడా ? ఆంటీలతో ఇతనికి వచ్చిన సమస్యలు ఏమిటి ? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాను అందమైన లొకేషన్‌లలో చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ, సంగీతంతో ఈ సినిమాకు మరో కొత్త రూపం తీసుకొచ్చారు. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది.
Also Read : కళ్ళు తెరిచి చూసేసరికి కాళ్ళు కాస్తా మాయమైతే… దిమ్మతిరిగే ట్విస్ట్ లున్న సై-ఫై మూవీ