BigTV English

Bunny Vas : గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు గుడ్ బై… ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు..

Bunny Vas : గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు గుడ్ బై… ఒక్క మాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు..

Bunny Vas : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య ఎన్నో హిట్ సినిమాలను ఆడియన్స్ కు అందించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇప్పటికే గీత ఆర్ట్స్ నుంచి ఎన్నో విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ మాత్రమే కాకుండా, గీత ఆర్ట్స్ బ్యానర్ 2 స్థాపించి ఈ బ్యానర్ నుంచి కూడా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్ లో బన్నీ వాసు సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే ఈ మధ్య అల్లు అరవింద్ తో గొడవలు జరిగాయని దాంతో బయటకు వచ్చి కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాసు క్లారిటీ ఇచ్చేశాడు.


గీతా ఆర్ట్స్ తో బన్నీ వాసు విభేదాలు..

గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 నుంచి టాలీవుడ్ లో భారీ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో బన్నీ వాసు గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అల్లు అరవింద్ తన బంధువును నిర్మాణ సంస్థలో భాగం చెయ్యడంతో అల్లు అరవింద్, బన్నీ వాసు మధ్య గొడవలు తలెత్తాయని అందుకే బన్నీ వాసు బయటకు వచ్చేసారని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈయన బీవి వర్క్స్ అనే కొత్త బ్యానర్ ప్రకటించారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.. ఆ ఇంటర్వ్యూలో ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చేశాడు.


నా మొదటి ప్రాధాన్యత ఆ బ్యానర్ కే…

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. గీత ఆర్ట్స్ అనేది నాకు నా తల్లితో సమానం. నాకు ఎంతో మంచి లైఫ్ ఇచ్చింది గీత ఆర్ట్స్ బ్యానర్ అని తెలిపారు. నేనెప్పుడూ కూడా గీత దాటి బయటకు వచ్చే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. మరి తాను బీవి వర్క్స్ ప్రకటించడానికి కారణం లేకపోలేదని తెలిపారు. ఈ బీవి బ్యానర్ అనేది నా ఫ్రెండ్స్ సర్కిల్ కోసం మాత్రమే. నేను ఆ బ్యానర్ లోనే సినిమాలు చేస్తాను. ఇది ఫిక్స్ అవ్వండి అంటూ ఆయన స్ట్రాంగ్ గా చెప్పారు. అయితే గతంలో కూడా ఇలా గీత దాటుతున్న బన్నీ వాసు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం సరికొత్త ప్రొడక్షన్ ప్రకటిస్తూ కొత్త అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అని ప్రకటించడంతో కచ్చితంగా గీత ఆర్ట్స్ వారితో విభేదాలు వచ్చాయని అందుకే బయటకు వచ్చారని అందరూ భావించారు.. కానీ ఆ వార్తలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు.

Also Read : జీవితంలో మరో ఛాన్స్ ఉంటుంది.. నాన్నను మళ్లీ ఇవ్వదురా..కన్నీళ్లు పెట్టించింది..

సినిమాల విషయానికొస్తే.. 

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 లో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా పనులలో బిజీగా గడుపుతున్నట్లు కూడా తెలియజేశారు.. అంతేకాదు మరో రెండు ప్రాజెక్టులను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే వాటిపై ప్రకటన రాబోతుందని టాక్..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×