Sridevi Drama Company Promo: బుల్లితెర పై ప్రసారం అవుతున్న టీవీ షోలల్లో ప్రత్యేకమైన రోజులు ఉంటే ఆ రోజుకు తగ్గట్లు స్పెషల్ గా స్కిట్ లతో, డ్యాన్స్ లతో అదరగోడతారు. ఫాధర్స్ డే సందర్బంగా పలు టీవీ ఛానెల్స్ కొత్త షోలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈటీవీ లో ప్రసారం అవుతున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. ‘డియర్ డాడీ’ అంటూ ఓ స్పెషల్ ఎపిసోడ్ చేశారు. దీనికి సీరియల్ సెలబ్రెటీలు కొందరు తమ చిన్నారులతో సందడి చేశారు. ఆ ప్రోమో ఎలా ఉందంటే..
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో..
జూన్ 15 న ఫాదర్స్ డే సందర్బంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్ సెంటిమెంట్ స్కిట్ లను, డ్యాన్స్ లను చేస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రోమోని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సీరియల్ సెలబ్రెటీలు కొందరు తమ చిన్నారులతో సందడి చేశారు. బిగ్‌బాస్ విశ్వ తన కుమారుడు రయన్‌తో కలిసి వచ్చాడు. అలనే సీరియల్ నటుడు పవన్ తన కూతురు చందమామతో షోలో మెరిశాడు. అలాగే కమెడీయన్ పృథ్వీ స్పెషల్ గెస్టుగా వచ్చారు. చిన్న పిల్లలతో ఆట పాటలు సరదాగా ఉంటాయి. ముఖ్యంగాడ్రాయింగ్ సరిగా వేయలేదని చందమామ ఫీల్ అవుతుంటే నువ్వు అందరి కంటే బాగా వేసినవ్.. నా కంటే బాగా వేసినవ్.. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్లే.. మేము ఇద్దరం విన్నర్స్‌యే అంటూ రయన్ అని అందరిని నవ్వేలా చేస్తాడు.. యాంకర్ రష్మీ గౌతమిని పిల్లలు ఓ ఆట ఆడుకుంటారు. పిల్లల స్కిట్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇది ఎపిసోడ్ కు అట్రాక్షన్ గా నిలుస్తుంది.
Also Read : టాలీవుడ్ ఇండస్ట్రీకి సుక్కు గుడ్ బై..? బాలీవుడ్ స్టార్ తో యాక్షన్ మూవీ..?
కన్నీళ్లు పెట్టించిన విశ్వ..
సీరియల్ నటుడు విశ్వ ఈ ఎపిసోడ్ లో నాన్న గురించి అదిరిపోయే స్కిట్ చేశాడు. ముసలి గెటప్ లో కనిపించిన విశ్వ నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా తన పర్సు నిండా డబ్బులున్నట్లు చూపిస్తాడు.. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న.. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి.. అరికాళ్లు భూదేవిని ముద్దాడుతున్నా కానీ పిల్లల కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీ కోసం గడియారం ముల్లులా నిత్యం నడుస్తూనే ఉంటాడు.. ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోరా జీవితం మరో అవకాశం ఇస్తుంది.. కానీ నాన్నను మళ్లీ ఇవ్వదురా అని అంటాడు.. ఆ సీన్ లోని డైలాగులు వినగానే అందరి గుండె బరువెక్కింది.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ స్కిట్ పై అందరు ప్రశంసలు కురిపించారు. ఈ ప్రోమోకు ఇదే హైలెట్ అయ్యింది. ఎపిసోడ్ మొత్తం ఇలాంటి ఎమోషనల్ సీన్లు ఉంటాయని అనిపిస్తుంది. అస్సలు మిస్ అవ్వకండి.. ఆ ప్రోమోను ఇక్కడ ఒకసారి చూసేయ్యండి…