E-Paper
Advertisement

Rahul Gandhi : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం.. హామీలన్నీ నెరవేర్చుతాం..

Rahul Gandhi : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం.. హామీలన్నీ నెరవేర్చుతాం..
Advertisement

Rahul Gandhi : తెలంగాణలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో వాగ్ధానాలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం నిర్మాణం అవుతుందని రాహుల్‌ గాంధీ తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటమే లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.

Advertisement

తెలంగాణ ఎన్నికలపై రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎంతో దృష్టిపెట్టారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేశారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తరచూ తెలంగాణలో పర్యటనలు చేశారు. ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాళేశ్వర ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏం చేస్తామో చెప్పారు.

ఆ తర్వాత పలు సభల్లో రాహుల్ పాల్గొన్నారు.ఎన్నికల ప్రచారం చివరి రోజు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఇలా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అదే దూకుడుతో కాంగ్రెస్ ప్రచారం సాగింది. తెలంగాణలో అధికారం సాధించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలపై తమకున్న చిత్తశుద్ధి గురించి రాహుల్ ప్రకనట చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×