BigTV English

Guntur Kaaram 2nd Single Promo : రొమాంటిక్ టచ్ తో అల్లాడిస్తున్న గుంటూరు కారం సెకండ్ సింగిల్..

Guntur Kaaram 2nd Single Promo : రొమాంటిక్ టచ్ తో అల్లాడిస్తున్న గుంటూరు కారం సెకండ్ సింగిల్..
Guntur Kaaram 2nd Single

Guntur Kaaram 2nd Single Promo : సంక్రాంతి బరిలో ముందంజలో ఉన్న చిత్రం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం. షూటింగ్ అనుకున్నది మొదలు ఏదో ఒక అవాంతరం..ఏదో ఒక గాసిప్.. ఇలా ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్న ఎట్టకేలకు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. జనవరి 12న ఫెస్టివల్ కల మరింత పెంచడానికి థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ పై కాన్సన్ట్రేట్ చేసిన చిత్ర బృందం ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు.


మంచి మసాలాతో వచ్చిన దమ్ మసాలా పాట.. అందరికీ తెగ నచ్చేసింది. మహేష్ ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి త్వరలో సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటిది మాస్ సాంగ్ అయితే రెండవది మంచి రొమాన్స్ సాంగ్. ఈ నేపథ్యంలో ఈరోజు గుంటూరు కారం మూవీ నుంచి సెకండ్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో రానే వచ్చింది.

ఓ మై బేబీ అంటూ వచ్చిన ఈ మెలోడియస్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో అద్భుతంగా ఉంది. ఎస్ థమన్ విస్ఫోటనం ట్యూన్స్ తో ఈ రొమాంటిక్ డ్యూయెట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రోమోలో తెలిసిపోతుంది. ఇక శ్రీ లీల తో మహేష్ ఎలాంటి రొమాన్స్ చేస్తాడు పూర్తి సాంగ్ విడుదలయితే తెలుస్తుంది.రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు శిల్పారావు తన గాత్రంతో ప్రాణం పోసింది.


“అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది..” అని శ్రీలీలతో మహేష్ బాబు చెప్పడం ఈ ప్రోమోలో చూడొచ్చు. ఇక వెనుక చిన్న హమ్మింగ్ గా.. ఓ మై బేబీ అంటూ వినిపిస్తుంది. ఇందులో మహేష్ బాబు డార్క్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకోగా ..అదే కలర్ శారీ తో శ్రీలీల అద్భుతంగా ఉంది. అనుకున్న దానికంటే చాలా తక్కువ నిడివి తో ఈ ప్రోమో ఉండడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది.శ్రీ లీల మామూలుగా ఎంతో అందంగా ఉంటుంది.. అయితే ఈ ప్రోమోలో మహేష్ పక్కన మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది అంటున్నారు అతని అభిమానులు. ఇక ఈ మూవీ నుంచి పూర్తి సెకండ్ సాంగ్ మరొక రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 13న మేకర్స్ విడుదల చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్ని ప్రోమో చాలా పెద్ద హంగామా చేస్తుంది.

.

.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×