BigTV English

Rana Daggubati : వశిష్ట మాయా లోకంలో.. రాక్షస రాజైన దగ్గుపాటి హీరో..

Rana Daggubati : వశిష్ట మాయా లోకంలో.. రాక్షస రాజైన దగ్గుపాటి హీరో..
Rana Daggubati

Rana Daggubati : కొన్ని సినిమాలు హీరోల జీవితంలో చెరిగిపోని ముద్ర వేస్తాయి. అప్పటివరకు వాళ్లని ఒకలాగా చూసిన ప్రేక్షకులు ఆ మూవీలో క్యారెక్టర్ తర్వాత అలా తప్ప ఇంకొక లాగా చూడాలి అనుకోరు. టాలీవుడ్  భల్లాల దేవుడు .. రానా దగ్గుపాటి పరిస్థితి కూడా ఇలాగే మారింది. బాహుబలి లో విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ పాత్రకు రానా తప్ప ఇంకెవరు సెట్ కారు అనే అంతగా అతని నటన అందరినీ ఆకర్షించింది. హీరోగా అన్ని సినిమాలు చేసిన రాని పాపులారిటీ విలన్ గా ఒకే ఒక సినిమా తెచ్చి పెట్టింది.


ఈ మూవీ తో రానాకి ఎంత క్రేజ్ వచ్చిందో అంతకంటే.. చిక్కులు కూడా వచ్చాయి. ఈ మూవీ తర్వాత రానా ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయలేడు. ఎందుకంటే అతనిపై ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి దానికి తగ్గట్టు ఉంటేనే అతను క్లిక్ అవుతాడు లేకపోతే గ్రాఫ్ పడిపోతుంది. బాహుబలి మూవీ తర్వాత విలన్ పాత్ర అంటే బెస్ట్ ఆప్షన్ రానా అనే అంతగా భల్లాల దేవుడు పాత్ర ప్రజల్ని మెప్పించింది. ఇంకొకళ్ళు అయితే ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని మంచి ట్రెండీ విలన్ గా సెటిల్ అయిపోయే వారే. కానీ ఈ దగ్గుపాటి హీరో మాత్రం ఆపరంగా అస్సలు అడుగులు వేయలేదు.

బడా స్టార్ హీరోలు ఎదురు అపోనేట్ గా ఉంటే తప్ప విలన్ పాత్ర చేసేది లేదు అని పట్టుబట్టి కూర్చున్నాడు రానా. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ అతనికి మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ద్వారా వచ్చింది.బింబిసారా మూవీ ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో మెగాస్టార్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో విలన్ గా చేసే ఆఫర్ రానాకి వచ్చింది. విశ్వంభర అనే టైటిల్ తో ముందుకు సాగే ఈ చిత్రంలో రానా విలన్ క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీలో రానా చేసే క్యారెక్టర్ వల్ల అతనికి బాహుబలిలో .. భల్లాల దేవుడు లాంటి గుర్తింపు వస్తుందని టాక్.


ఈ మూవీలో రానా విలనిజం ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.. అంతేకాదు రానా ఇంచుమించు ఓ రాక్షసుడు మాదిరి కనిపిస్తాడు. చిరంజీవి చేస్తున్న ఈ మూవీ సోషల్ ఫాంటసి స్టోరీ కావడంతో.. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త లోకాన్ని సినిమా కోసం సృష్టించబోతున్నారు. ఇక లోకంలో ఒక రాక్షస రాజు లాంటి పాత్ర ఉంటుంది.. ఇదిగో ఆ పాత్ర రానా పోషిస్తున్నాడు. ఈ పాత్ర కోసం రానా గెటప్ హాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్న స్ఫూర్తితో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×