E-Paper
Advertisement

Guntur Karam First Song : “సర్రుమండుతాది బాబు గొడ్డుకారం”.. ఘాటుగా ఫస్ట్ సింగిల్..

Guntur Karam First Song : “సర్రుమండుతాది బాబు గొడ్డుకారం”.. ఘాటుగా ఫస్ట్ సింగిల్..
Advertisement
Guntur Karam First Song

Guntur Karam First Song : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. సుమారు 12 ఏళ్ల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు మహేష్ బాబు పక్కా మాస్ అవతార్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. నెవర్ బిఫోర్..నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఈ మూవీలో మహేష్ మాస్ స్టైల్ ఉండబోతోంది అని టాక్.

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పలు రకాల ఫోటోలలో మహేష్ బాబు ఇంతవరకు ఎప్పుడు కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు అని స్పష్టం అయిపోయింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారంపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. తాజాగా గుంటూరు కారం చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ అంచనాలను మరింత పెంచే విధంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా మూవీ మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు.

Advertisement

గుంటూరు కారం మూవీ నుంచి విడుదల అయిన దమ్ మసాలా అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ క్రేజీగా ఉంది. ఇక ఈ పాటకి తమన్ ఫుల్ జోష్ మాస్ బీట్ అదిరింది. ఈ మాస్ బీట్ సాంగ్ కి ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సంజిత్ హెగ్డే, థమన్ ఆలపించారు. ఈ మూవీలో ఇది మహేష్ ఇంట్రాడక్షన్ సాంగ్ అని అర్థమవుతోంది. ఇక మహేష్ మాస్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. లిరిక్స్ కూడా మంచి క్యాచీగా ఉన్నాయి.

ఈ చిత్రంలో మన వంట గదిలో ఎన్ని కారాలు.. మసాలాలు ఉన్నాయో.. అన్ని వాడేసినట్లు కనిపిస్తోంది. సర్రుమండుతాది బాబు గొడ్డుకారం.. గిర్ర తిరుతాది వీడితోటి బేరం.. అంటూ సాగే ఈ పాట మంచి మాస్ బీట్ తో ఆకట్టుకుంటుంది. ఈ లిరికల్ సాంగ్ కి మహేష్ బాబు బీడీ అంటించుకునే విజువల్ మరింత అట్రాక్షన్ తెచ్చిపెడుతోంది. ఫస్ట్ పాట ఇలా ఉంటే ఇక మూవీలో మహేష్ మాసవతారం వేరే ఇంట్లో ఉంటుందో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×