BigTV English

Masako : 88 ఏళ్ల బామ్మ.. యాప్ డెవలపర్

Masako : 88 ఏళ్ల బామ్మ.. యాప్ డెవలపర్
An app developer at the age of 88

Masako : సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ వయసుతో పని లేదు. జపాన్ బామ్మ మసాకో వకామియా నిరూపించింది అదే. వయసు ఉడిగింది.. ఏమీ చేయలేను..అని అందరిలా ఆమె అనుకోలేదు. అందుకే 88 ఏళ్ల వయసులో యాప్ డెవలపర్‌గా అందరి దృష్టినీ ఆకర్షించింది.


మరీ ముఖ్యంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ మసాకో స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో ముగ్ధులయ్యారు. మసాకోతో భేటీ అయ్యేందుకు ఆమెను అమెరికాకు ఆహ్వానించారు. సోషల్ మీడియాలో మసాకో పేరు హోరెత్తిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

43 ఏళ్ల పాటు బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు మసాకో. రిటైర్మెంట్ అనంతరం 58 ఏట ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ఓ కంప్యూటర్‌ను కొనుగోలు చేసిన మసాకో.. ఎక్సెల్ అప్లికేషన్ సాయంతో ఆర్ట్‌వర్క్‌లను రూపొందించింది. కొన్నేళ్ల పాటు సీనియర్ సిటిజెన్లకు టీచర్‌గా మారింది. కంప్యూటర్లు, గేమింగ్ యాప్‌ల ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించేలా వారందరినీ ఎంతగానే ప్రోత్సహించడం విశేషం.


81 ఏళ్ల వయసులో గేమ్ డెవలప్‌మెంట్ కోసం కోడింగ్ నేర్చుకుంది. సీనియర్ సిటిజెన్ల కోసం ప్రత్యేకంగా వినూత్న యాప్‌లు, వీడియో గేమ్‌లు ఎన్నింటినో రూపొందించింది. ఆమె రూపొందించిన గేమింగ్ యాప్ ‘హినదాన్’ ఎంతో పేరు తెచ్చి పెట్టింది. జపాన్‌లో ఏటా జరిగే డాల్ ఫెస్టివల్ ఆధారంగా ఆ యాప్‌ రూపొందింది.

ఆ యాప్ టిమ్ కిక్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అమెరికా రావాల్సిందిగా ఆమెకు ఆహ్వానం పంపారు. యాపిల్ డివైజెస్ అన్నింటిపైనా ఆ యాప్ పనిచేసేలా చూడటమే వారిద్దరి భేటీ ప్రధాన లక్ష్యం. తనకు ఇప్పుడు 88 ఏళ్ల వయసు అని, గతం కన్నా ఇప్పుడు తనకు తెలివితేటలు పెరిగాయని చెబుతోంది మసాకో. ప్రస్తుతం ఆమె జపాన్ అంతటా తిరుగుతూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×