E-Paper
Advertisement

Guntur Karam Update : గుంటూరు కారం క్రేజీ అప్డేట్.. సెకండ్ సింగిల్ కి డేట్ ఫిక్స్..

Guntur Karam Update : గుంటూరు కారం క్రేజీ అప్డేట్.. సెకండ్ సింగిల్ కి డేట్ ఫిక్స్..
Advertisement
Guntur Karam Update

Guntur Karam Update : మహేష్ బాబు .. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సంక్రాంతికి బరి లోకి దిగుతున్న ఈ చిత్రానికి సంబంధించి మెల్లిగా ప్రమోషన్స్ ను చిత్ర బృందం మొదలుపెట్టేసారు. చిన్నగా ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ధమ్ మసాలా.. మహేష్ లోని మాస్ టచ్ అందరికీ పరిచయం చేసింది.

ఇక రెండవ సింగిల్ విడుదల పై లేటెస్ట్ గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ మూవీ నుంచి రెండవ పాటని కూడా విడుదల చేయబోతున్నట్లు టాక్. రీసెంట్ గా ఈ విషయం గురించి మాట్లాడిన ప్రొడ్యూసర్ నాగ వంశీ.. మూవీలో పాటల విడుదల గురించి క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ వారమే పాట విడుదల కావలసి ఉంది కానీ షూటింగ్ లో కాస్త ఆలస్యం కావడంతో ఈ పాట విడుదలకు సంబంధించిన ప్లాన్ లో కాస్త మార్పులు చేశారు. మూవీకి సంబంధించిన సెకండ్ సింగిల్ డిసెంబర్ 10 లోపు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

Advertisement

ఈ నేపథ్యంలో సాంగ్ కి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 5 లోపు పూర్తిచేసే విధంగా అన్ని రెడీ చేస్తున్నారు. అయితే ఇంతకుముందు వచ్చింది మాస్ మసాలా సాంగ్ అయితే ఇది మంచి మెలోడీ సాంగ్ అని తెలుస్తుంది. ఈ చిత్రంలో థమన్ నాలుగు పాటలు కంపోజ్ చేశాడు. వీటిలో శ్రీ లీలా, మహేష్ బాబు మధ్యలో ఉండే ఒక మాస్ సాంగ్ అద్భుతంగా ఉండబోతుందట. ఇందులో హీరో .. హీరోయిన్..ఇద్దరు లుంగీ గెటప్ లో కనిపిస్తారట.

అయితే నెక్స్ట్ రాబోయే పాట మెలోడీ అనడంతో ఇది కచ్చితంగా మంచి రొమాంటిక్ సాంగ్ అయి ఉంటుంది అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ పాట ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో డిసెంబర్ 10 కి తెలుస్తుంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న గుంటూరు కారం చిత్రానికి పోటీ గట్టిగా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ షేక్ చేస్తుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ మూవీ తర్వాత మహేష్.. రాజమౌళితో తన నెక్స్ట్ మూవీ కి రెడీ కాబోతున్నాడు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×