Big Stories

24 Crafts : మన సినిమాలోని 24 క్రాఫ్టులు ఇవే..!

Share this post with your friends

24 Crafts

24 Crafts : మనకున్న కళా రూపాల్లో సినిమా ఒకటి. కాలంతో బాటు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వచ్చిన ఈ సినిమా నిర్మాణంలో 24 విభాగాల వారు పనిచేస్తుంటారు. వీరందరి ఉమ్మడి కృషి, చెరగని సమన్వయమే మనకు సినిమా రూపంలో తెర మీద కనిపించి అలరిస్తూ ఉంటుంది. మరి ఈ 24 విభాగాలు ఏమిటి? వాళ్లు చేసే పని ఏమిటో తెలుసుకుందాం.

1.దర్శకుడు (Director) : దర్శకుడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు ఈ 24 విభాగాలను నడుపుతూ సినిమాను తెరకెక్కించేది దర్శకుడే. ఇతనికి సాయంగా కో-డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తారు. ఈ దశల్ని దాటాకే ఎవరైనా డైరెక్టర్ అవుతుంటారు. దర్శకుడు స్క్రిప్ట్ గురించి వీరితో చర్చించి, ఫైనల్‌గా సినిమాకు రూపాన్నిస్తాడు. మిగతా 23 విభాగాలు ఇతను చెప్పినట్లు చేయాల్సిందే.

 1. కథ (Script): ఏ సినిమాకైనా ప్రాణం.. కథ. దర్శకుడి నిర్ణయాన్ని బట్టి కథను విడిగా రాయించటం, లేదా రచయితే దర్శకుడైతే అతని కథ ఆధారంగా సినిమా తీయటం జరుగుతుంటుంది. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఈ విభాగం కిందికే వస్తాయి.

3.మ్యూజిక్ డైరెక్టర్ : దర్శకుడి అభిరుచి, కథా నేపథ్యాన్ని బట్టి సంగీత దర్శకుడు పాటలు ట్యూన్ చేస్తాడు.

 1. పాటల రచయిత (Lyrics): సినిమాకి కావలసిన పాటలు, దాని సందర్భాలు దర్శకుడు చెప్పగా రచయిత.. పాటలు సిద్ధంచేస్తాడు.
 2. కొరియోగ్రాఫర్ : పాట.. అందుకు తగ్గ మ్యూజిక్ రెడీ కాగానే.. డాన్స్ రంగంలోకి వస్తుంది. పాటకు తగ్గట్టుగా, సంగీతానికి అనుగుణంగా డాన్స్‌ను అందించే పనిని కొరియోగ్రాఫర్ తీసుకుని, నటీ నటుల చేత స్టెప్పులు వేయిస్తాడు.
 3. ఫైట్ మాస్టర్ (Fight/ Stunt Master): సినిమా జోనర్ ( డ్రామా, కామెడీ, యాక్షన్, లవ్, హర్రర్)ను బట్టి వీరి అవసరం, ప్రాధాన్యం ఆధారపడి ఉంటాయి. హీరోయిజం ఎలివేట్ కావటంలో ఫైటింగ్ సీన్స్ కీలకపాత్ర పోషిస్తాయి.
 4. సినిమాటోగ్రఫీ : సినిమాలోని సీన్స్‌ను అందంగా మలిచే పనిని దర్శకుడి కోరిక మీదకు సినిమాట్రోగ్రాఫర్ చిత్రీకరిస్తాడు. లైట్ బాయ్స్, ఆపరేటింగ్ కెమెరామెన్స్ వీరంతా సినిమాటోగ్రాఫర్ కింద పనిచేస్తారు.
 5. ఎడిటర్ (Editor): సినిమా తీయటం పూర్తయ్యాక.. కావాల్సిన సీన్స్‌ను స్క్రీన్‌ ప్లేకు అనుకూలంగా మలచి, అనవసరమైన సీన్స్ తీసేసే పని ఎడిటర్‌దే. ఎడిటింగ్ పూర్తయ్యాకనే సినిమా రిలీజ్ అవుతుంది.
 6. నటీనటులు (Cast): సినిమా కథలోని రోల్స్‌ను బట్టి హీరో, హీరోయిన్, విలన్, ఫ్రెండ్ క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్.. ఇలా వీరిని ఎంచుకుంటారు. వీరు తమ నటను సినిమాను రక్తికట్టిస్తారు.
 7. డబ్బింగ్ : సినిమాకి నటీనటులు ఎంత ముఖ్యమో వారి వాయిస్ కూడా అంతే ముఖ్యం. నటన బాగున్నా.. వాయిస్ బాగాలేని, ఇతర భాషల నటులకు డబ్బింగ్ ఆర్టిస్టులు గొంతునిస్తారు.
 8. మేకప్ : నటీనటులను పాత్రకు తగినట్లుగా మలచి, వారిని కెమెరా ముందు అందంగా కనిపించేలా చేసే పని మేకప్ విభాగానిదే.
 9. కాస్ట్యూమ్స్ : కథ, పాత్రల స్వరూపం, సందర్భం, స్థాయిని బట్టి వారికి అవసరమైన దుస్తులను ఎంపికచేసి, షూటింగ్ టైమ్‌కి సిద్ధం చేయటం కాస్ట్యూమ్స్ డిజైనర్ పని.
 10. ఆర్ట్ డైరెక్టర్ : ఒక సీన్‌ను తాజ్ మహల్ వంటి అద్భుతమైన ప్రదేశంలో తీయాలంటే అక్కడికి వెళ్లే పనిలేకుండా, ఇక్కడే ఆ సెట్ వేయటం, నిజంగానే తాజ్ మహల్ ముందు షూట్ చేశారనేంతగా దానిని మలచటం వీరి పని. సీన్ తీసే ప్రదేశపు వాతావరణాన్ని సహజంగా కెమెరా ముందు ప్రజెంట్ చేసే బాధ్యత వీరిదే.
 11. ఆడియో గ్రఫీ : సినిమా డైలాగ్స్‌ను నటీనటుల మాట్లాడే పదాలతో కలిసి, నిజంగా మాట్లాడారు అనేలా చేయటంతో బాటు సినిమా మధ్యలో వచ్చే బాక్ గ్రౌండ్ మ్యూజిక్ (నేపథ్య సంగీతం) బాధ్యత కూడా ఇతనిదే.
 12. చైల్డ్ ఆర్టిస్ట్ : సినిమాల్లో బాల నటీనటులున్న సన్నివేశాల్లో అందుకు తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసి వారిచేత చక్కగా ఆ పాత్ర పండేలా చేయించే బాధ్యత ఈ విభాగానిదే.
 13. జూనియర్ ఆర్టిస్టులు: వీరు సన్నివేశాల్లో ప్రధాన నటీనటుల వెనక ఉండి, అవసరాన్ని బట్టి తమ పాత్రను పోషిస్తారు.

17.డ్రైవర్: సినిమా చిత్రీకరణకు కావాల్సిన రవాణా సదుపాయాల బాధ్యత వీరిదే.

18.సాంకేతిక బృందం(టెక్నికల్ టీం): వీరు దర్శకుడి కింద పనిచేస్తూ.. దర్శకుడు కోరిన రీతిలో టెక్నికల్ సపోర్టు చేస్తుంటారు.

19.స్టూడియో వర్కర్: షూటింగ్ చేసే ప్రదేశంలో కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు.

20,21. ప్రొడక్షన్ ఉమెన్, ప్రొడక్షన్ అసిస్టెంట్: సినిమా లో పనిచేసే అందరికీ దగ్గర ఉండి భోజన సదుపాయాలను అందిస్తుంటారు.

 1. పబ్లిసిటీ డిజైనర్: సినిమా ప్రమోషన్లు ఎలా చేయాలి? జనానికి రిలీజ్‌కు ముందే సినిమాపై ఆసక్తిని పెంచి, సినిమా సక్సెస్ అయ్యేలా చూడటం వీరి పని.
 2. స్టిల్ ఫోటోగ్రాఫర్: వీరు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికరమైన స్టిల్స్​ను క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వాటినే పోస్టర్ల ద్వారా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.
 3. లైట్ మెన్: వీరు సినిమా షూటింగ్ కు అవసరమై లైటింగ్ ఏర్పాటు చూస్తారు.

పై అన్ని విభాగాలకు డబ్బు పెట్టే నిర్మాత మాత్రం 24 విభాగాల్లో కనిపించడు. ఒక రకంగా వీరు ప్రొడక్షన్‌లో భాగమే అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వీరిని ప్రస్తావించరు. ఇంటర్నెట్ వచ్చాక.. మారిన పరిస్థితుల్లో ఈ 24 విభాగాల్లో కొన్ని విభాగాలను ఔట్ సోర్స్ చేసే అవకాశం వచ్చింది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News