Big Stories

Telangana Elections | ఏ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయాలో తెలియదా? ఓటర్ స్లిప్ అందలేదా? ఇలా చేయండి..

Telangana Elections | మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశాయి. కొందరు ఓటర్లకు ఇంకా ఓటర్ స్లిప్పులు అందలేదని తెలుస్తోంది.

- Advertisement -

అడ్రస్‌ మారడం వల్లో లేదా ఇతర కారణాల వల్లో ఓటర్ స్లిప్పులు కొందరికి అందకపోయి ఉండొచ్చు. ఆ కారణం చేత ఓటు వేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా మొబైల్ నుంచి సులువుగా మీ పోలీంగ్ బూత్ వివరాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -

1950 లేదా 92117 28082 నెంబర్లకు మీ ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్‌ని మెసేజ్ చేయండి. వెంటనే మీ పోలింగ్ బూత్ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్‌ ద్వారా మీకు అందుతాయి. పోలింగ్‌ కేంద్రం, బూత్‌ నంబరు, క్రమ సంఖ్య వంటి అన్ని వివరాలు ఎస్సెమ్మెస్‌ ద్వారా తెలసుకోవచ్చు.

అలాగే 1950 నెంబర్‌కు ఫోన్ చేసి కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. 1950 ఓ టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్ 24 గంట పాటు పనిచేస్తుంది.

‘ఓటరు హెల్ప్‌లైన్‌’(Voter Helpline) యాప్‌ ద్వారా కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది. లేదా ఎన్నికల కమీషన్ వెబ్‌సైట్‌ www.electoralsearch.eci.gov.in లేదా www.ceotelangana.nic.in ద్వారా పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.

www.ceotelangana.nic.in లోని చాట్ బాట్ ‘Ask Voter Sahaya Mithra’ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీ ఓటర్ గుర్తింపు కార్డుకి లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా పోలీంగ్ బూత్ వివరాలు పొందవచ్చు.

ఓటర్ స్లిప్పు లేకపోతే నేరుగా ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఏదైనా గుర్తింపు కాడు (ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాసుపోర్టు, ఫొటో ఐడీ ఉన్న బ్యాంకు పాసుపుస్తకం లేదా పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం, పాన్‌కార్డు లాంటివి చూపించొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News