GV Prakash Kumar – Saindhavi..ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు, హీరో జీవీ ప్రకాష్(GV Prakash)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరంలేదు. ఒకవైపు సంగీత దర్శకుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే, మరొకవైపు హీరోగా కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈయన తన చిన్ననాటి స్నేహితురాలైన ప్రముఖ సింగర్ సైంధవి (Saindhavi)ని 2013లో వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఈ ఏడాది సడన్ గా విడిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంత సడన్ గా విడాకులు తీసుకోవడం ఏంటి? అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు విడాకులు తీసుకోవడం వెనుక అసలు కారణం తెలియదు కానీ 11 ఏళ్ల వైవాహిక బంధానికి ఇలా పుల్ స్టాప్ పెట్టడంతోనే అసలు కారణం తెలుసుకోవాలని అభిమానులు సైతం తెగ తాపత్రయపడుతున్నారు.
విడాకుల తర్వాత మళ్లీ కలిసిన జంట..
ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత మళ్లీ ఒకచోట కనిపించి అభిమానులను సంబరపరిచారు ఈ జంట. తాజాగా వీరిద్దరూ కలిసి ఒకేచోట కనిపించారు. మలేషియాలోని ఒక సంగీత కచేరిలో పాల్గొన్న జీవీ. ప్రకాష్ , సైంధవి జంటగా పాటలు ఆలపించి శ్రోతలను అలరించారు. ముఖ్యంగా ఇది చూసి అభిమానులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు అని చెప్పాలి. ఇంత చక్కగా ఉన్న జంట విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ కూడా నిట్టూరుస్తున్నారు. ఇకపోతే ఈ సంగీత కచేరి కోసం జీవి ప్రకాష్ రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా సైంధవీ తన కూతుర్ని తండ్రి దగ్గరకు పంపించడం మనం చూడవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా అధికారిక ఎక్స్ ఖాతాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ జంట మళ్లీ కలుసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. మరి కనీసం పాప కోసమైనా ఈ జంట కలుస్తుందేమో చూడాలి.
జీవి ప్రకాష్ కెరియర్..
జీవి ప్రకాష్ కెరియర్ విషయానికి వస్తే.. తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ గా, హీరోగా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా సైంధవి తో కలిసి ఎన్నో పాటలు కూడా పాడారు. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, యుగానికి ఒక్కడు, కథానాయకుడు, డార్లింగ్, పందెం కోళ్ళు, ఎందుకంటే ప్రేమంట, ఆకాశమే నీ హద్దురా, రాజారాణి, టైగర్ నాగేశ్వరరావు, సార్ చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన లక్కీ భాస్కర్, మట్కా చిత్రాలకి కూడా సంగీతం అందించారు. ఇందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిస్తే.. మరికొన్ని అట్టర్ ప్లాఫ్ గా నిలిచాయి. అయినా సరే సంగీత దర్శకుడిగా ఈయనకు మంచి పేరు ఉంది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన ప్రస్తుతం ఈ మూడు భాషలలో పదికి పైగా సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాది హీరోగా కూడా మూడు సినిమాలలో నటించారు జీవి ప్రకాష్. ప్రస్తుతం మరో మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక కెరియర్ లో బిజీగా ఉన్న ఈయన వ్యక్తిగత జీవితంలో వైవాహిక బంధానికి స్వస్తి పలికారని చెప్పవచ్చు.
Omg ❤️🥺 bt the professionalism btwn them is! 🥹#GVPrakash #gvprakashconcert #GVPrakashKumar #Saindhavi pic.twitter.com/jgarTEbmY9
— Mr.D 🤍 ᵈⁱˡˡᵘ (@dilson_raj) December 9, 2024