13 Years for Panjaa : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాలు విపరీతంగా యూత్ కు ఎక్కేసాయి. రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలు చేయడం కాకుండా తనకంటూ ఒక సొంత స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఆటిట్యూడ్ అంటే ఏంటో బద్రి అనే సినిమాతో పవన్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే పిచ్చెక్కిపోయే వాళ్ళు. ఒక సినిమా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఒక రీమేక్ సినిమాను కూడా ఒరిజినల్ కంటే అద్భుతంగా సామర్థ్యం కూడా పవన్ కళ్యాణ్ కి ఉంది. దానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా.
కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా పవన్ కళ్యాణ్ టాలెంట్ చూపించాడు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు. మరోవైపు సినిమాలకు కూడా తన సమయాన్ని కేటాయించి ఒప్పుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓ జి. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్ స్టార్ రోల్ లో చూడాలని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఇదే రోల్ లో పవన్ కళ్యాణ్ పంజా అనే సినిమాలో కనిపించాడు. బాక్స్ ఆఫీస్ పైన పంజా దెబ్బ అప్పుడు గట్టిగ పడలేదు. అని ఇప్పటికీ పంజా సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.
Also Read : KRK on Game Changer Movie : గేమ్ ఛేంజర్ ఓ భోజ్ పురి సినిమా
పంజా సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలామందికి విపరీతంగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ను చాలా స్టైలిష్ గా చూపించాడు దర్శకుడు విష్ణువర్ధన్. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ పాటలు విన్నా కూడా ఒక మంచి ఫీల్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈ సినిమా అప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు కాని ఇప్పుడు చూసినా కూడా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. ఇంత మంచి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎందుకు ఫెయిల్ అయింది అని ఆలోచన రావడం మానదు. ఈ సినిమా ఈవెంట్ కు ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అడవి శేష్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు. ఏదేమైనా పంజా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పాలి. నేటితో ఈ సినిమా వచ్చి 13 ఏళ్లయింది.