BigTV English

Money Sentiment : మంగళ, శుక్రవారాలు డబ్బుల సెంటిమెంట్ వెనుక అసలు విషయం ఇదే!

Money Sentiment : మంగళ, శుక్రవారాలు డబ్బుల సెంటిమెంట్ వెనుక అసలు విషయం ఇదే!
Money Sentiment

Money Sentiment : మంగళవారం, శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వకూడదన్న సెంటిమెంట్ ప్రాచీన కాలం నుంచీ వస్తున్న ఆర్ధిక సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఒక నిగూడార్థం ఉంది. డబ్బులు ఖర్చుపెట్టడమంత తేలిక కాదు సంపాదించడం. దాచి ఉంచిన డబ్బును బయటకు తీసి ఖర్చు చేసేస్తే మరలా కూడబెట్టడం కష్టం కదా!


ఏ ఇంట్లలోనైనా కష్టపడి సంపాదించేది ఒకరైతే కులాసాగా ఖర్చుపెట్టేది మరొకరు. ఇటువంటి జల్సారాయుళ్లను ఒకనాటి వరకైనా నిలురించడానికి మంగళవారం,శుక్రవారాలు పనికి వస్తాయి కదా. పున్నమి అమావాస్య, రోజుల్లో ఇంట్లోని రూపాయిని బయటకు పంపించారు చాలా మంది. కొన్ని కొన్ని సాధించడానికి మనకు మనమే కొన్ని కట్లుబాట్లనూ నియమాలనూ ఏర్పరుచుకోవాలి. లేకపోతే ఏమీ సాధించలేని అసమర్థులమైపోతాం.

శ్రీమహాలక్ష్మీ దేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారానికి మరో పేరు భృగువారం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావడం కష్ట అని , మంగళవారం నాడు అప్పు ఇస్తే కలహాలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం.
శుక్రవారం డబ్బులిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని.. లక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోతుందని కొంతమంది సెంటిమెంట్ గా భావిస్తుంటారు.
మంగళ, శుక్రవారాల సెంటిమెంట్ అన్ని ప్రాంతాల్లో ఉండదు.


ధనం విషయంలో సోమరిపోతు తనం తగ్గించాలనే పెద్దలు ఇలాంటి సంప్రదాయం పెట్టారు. మనకున్న చాలా సంప్రదాయాలు ఈవిధంగా మనకు మనం విధించుకొన్నవే. దీని వల్ల మంచేగాని చెడు లేదు. ఆచారం ఒక్కటే తెలిసి ఉంటే ఫలితం లేదు ఆచారణ కూడా ఉండాలి. అత్యవసర సమయాలలో , అపాయకర సమయాల్లో ఆచారాలు పాటించాల్సిన పనిలేదని శాస్త్రాలు, స్మృతులు చెబుతున్నాయి. కొన్నింటిని పోగోట్టుకుంటేనా కొన్నింటిని సాధించగలం. ఆర్ధిక లావాదేవీలకు ఆంక్షలు పెట్టుకోవడం మంచిదే. మంగళవారం, శుక్రవారాల్లో డబ్బులు ఇవ్వకూడదన్న దాంట్లో నిజం లేదు కానీ పాటించడం మంచిదే.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×