E-Paper
Advertisement

Hari Hara Veera Mallu: యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా మారిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Hari Hara Veera Mallu: యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా మారిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Hari Hara Veera Mallu:ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఇది 17వ శ‌తాబ్ద‌పు నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న పీరియాడిక్ మూవీ. క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్ జ‌రుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో హ‌రి హ‌ర వీర మ‌ల్లు షూటింగ్ జ‌రుగుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ‘హ‌రి హ‌ర వీర మ‌ల్లు’ సినిమా కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా మారారు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్‌ను ప‌వ‌న్ నేతృత్వంలో చిత్రీక‌రించార‌ట‌.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించటం ఇదేమీ కొత్త కాదు. గ‌తంలో త‌మ్ముడు, డాడీ, జానీ, ఖుషి వంటి సినిమాల‌కు ఆయ‌నే ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. చాలా ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌నే ఈ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డైరెక్ట్ చేశార‌ట‌. మ‌రి ఈ స‌న్నివేశాలు ఏ రేంజ్‌లో ఉండ‌బోతున్నాయో తెలియాలంటే సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. హ‌రి హ‌ర వీర మ‌ల్లు చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్‌.. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మొఘ‌ల్ యువ‌రాణి పాత్ర‌లో న‌ర్గీస్ ఫ‌క్రి చేస్తుండ‌గా.. మ‌రో హీరోయిన్ పాత్ర‌లో నిధి అగ‌ర్వాల్ క‌నిపించ‌నుంది. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×