BigTV English

Congress: బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ.. మరి, కాంగ్రెస్? సమయం లేదు రేవంత్!!

Congress: బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ.. మరి, కాంగ్రెస్? సమయం లేదు రేవంత్!!

Congress: బీజేపీలో కదనోత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ కు ఎట్టిపరిస్థితుల్లోనూ మరో ఛాన్స్ ఇవ్వొద్దని గట్టిగా ఫిక్స్ అయింది. నౌవ్ ఆర్ నెవర్ అనే పట్టుదలతో పోరాటానికి సిద్ధమవుతోంది. జనవరి నుంచి వేలాది సభలు, సమావేశాలతో రానున్న 10 నెలలు కాషాయ దళమంతా ప్రజల్లోనే ఉండేలా రోడ్ మ్యాప్ రెడీ అయిపోయింది. స్వయంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బండి.. గేరు మార్చి.. కేసీఆర్ మీదకు వదిలారు. ఆయనేమో రయ్ రయ్ మంటూ దూసుకుపోతుండటంతో కేసీఆర్ లో కంగారు మొదలైందని అంటున్నారు.


అంతా బాగుంది. బీజేపీ దూకుడు బహుబాగుంది. మరి, తెలంగాణలో బీజేపీ ఒక్కటేనా ప్రతిపక్షం? కాంగ్రెస్ కనిపించదేం ఆ ఉత్సాహం? అనే చర్చ జరుగుతోంది. గతమెంతో ఘనమైన కాంగ్రెస్ ఎందుకిలా డీలా పడింది? కాస్త గట్టిగా ప్రయత్నిస్తే కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టించే సత్తా ఉన్నా కూడా ఎందుకిలా నిరాశలో కూరుకుపోయింది? హస్తం పార్టీ ఇంకా మారదా? వారిలో వారు కొట్లాట ఆగదా? ఆధిపత్య పోరు, గ్రూపులు, కుట్రలతో కాంగ్రెస్ ను ఆగం చేశారా? అనే ప్రశ్నలు.

ఎన్నికలకు ఇంకా ఏడాది ఉందని తీరిగ్గా ఉండే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ కి ఇంకా ఏడాది మాత్రమే ఉంది. ఈసారి పోరు మామూలుగా ఉండదు మరి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ట్రయాంగిల్ హోరాహోరీ తప్పకపోవచ్చు. ఓట్లు చీల్చేందుకు షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ లు ఉండనే ఉన్నారు. టీడీపీ సైతం ఎంతోకొంత ప్రభావం చూపకమానదు. వీరితో ఎవరి ఓట్లకు ఎసరు వస్తుందోననే టెన్షన్ ప్రధాన పార్టీలను వేధిస్తోంది. ఇంతటి కీలకమైన సమయంలో.. కాంగ్రెస్ ఇంతలా ఉదాసీనంగా ఉండటాన్ని పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి.


బీజేపీ బ్యాక్ టు బ్యాక్ కేసీఆర్ పై అటాక్ చేస్తుంటే.. కాంగ్రెస్ ఏమో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ గా మారి వారిలో వారు ఫైట్ చేసుకుంటున్నారు. అంతా జట్టు కట్టేది ఎప్పుడు? ప్రగతి భవన్ పై దండెత్తేది ఇంకెప్పుడు? కనీసం బీజేపీని చూసైనా యాక్టివ్ కావాలనే సోయి కూడా లేకుండా పోయిందా? కొత్త ఏడాదిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మినహా మరే రకమైన కార్యచరణ కనిపించడం లేదు. హైకమాండ్ సైతం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు లేదు. ఇప్పటికే తెలంగాణ పొలిటికల్ రేసులో కాంగ్రెస్ బాగా వెనుకబడిందని.. సమయం లేదు రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి, ఇకముందైనా బీజేపీకి ధీటుగా కేసీఆర్ పై కాంగ్రెస్ పోరాడుతుందా?

Related News

Solar Village: సీఎం ఊరుకు సౌర సొబగులు.. దేశంలోనే రెండో సోలార్ విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Musi River Floods: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్..

Kadapa TDP Internal Issue: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Big Stories

×