E-Paper
Advertisement

Hari Hara Veeramallu Teaser: ధర్మం కోసం యుద్ధం సరే.. సినిమాకి డైరెక్టర్ ఉన్నాడా..? లేడా..?

Hari Hara Veeramallu Teaser: ధర్మం కోసం యుద్ధం సరే.. సినిమాకి డైరెక్టర్ ఉన్నాడా..? లేడా..?
Advertisement

Pawan Kalyan’s ‘Hari Hara Veeramallu’ Teaser Released: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారాల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పార్టీ ఫండ్ కోసం మాత్రమే ఆయన సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను AM రత్నం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈపాటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ రాజకీయ ప్రచారం వలన మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా షూటింగ్ కూడా ఫినిష్ అవ్వలేదని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే హరిహర వీరమల్లు నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఏ రేంజ్ రికార్డ్స్ ను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటే.. ఇంకోపక్క క్రిష్ మరో సినిమాతో బిజీగా మారాడు. మధ్యలో ఈ సినిమా అలాగే మిగిలిపోయింది. రిలీజ్ డేట్ కూడా రాకపోవడంతో అస్సలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనే డైలమాలో పడిపోయారు పవన్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కు ఒక ఊహించని అప్డేట్ ను మేకర్స్ అందించారు. హరిహర వీరమల్లు టీజర్ డేట్ ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. మే 2 న ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ధర్మం కోసం యుద్ధం అని క్యాప్షన్ ఇస్తూ దూసుకుపోతున్న బాణాలను చూపించారు.

Advertisement

Also Read: Sudigali Sudheer: పులిహోర రాజా.. నలుగురు హీరోయిన్స్ లో ఒక్కరిని కూడా వదలలేదుగా..

ఇక్కడవరకు బాగానే ఉన్నా.. పోస్టర్ లో డైరెక్టర్ పేరు లేకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పోస్టర్ పై పవన్ పేరు మధ్యలో.. ఇటుపక్క ప్రొడక్షన్ పేరు.. ఇంకోపక్క నిర్మాత పేరు ఉంది కానీ.. ఎక్కడా డైరెక్టర్ క్రిష్ పేరు లేదు. దీంతో డైరెక్టర్ ఉన్నాడా.. ? లేడా .. ? అనే అనుమానం మొదలయ్యింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కొత్త పోస్టర్ లో క్రిష్ నేమ్ ఉంటుందని తెలుస్తోంది. పోస్టర్ కింద మాత్రం క్రిష్ పేరును మేకర్స్ యాడ్ చేయడంతో పర్లేదు.. క్రిష్ ఉన్నాడు అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×