BigTV English

Sudigali Sudheer’s Sarkaar 4 Promo: నలుగురు కుర్ర హీరోయిన్స్ తో సుధీర్ రచ్చ.. మాములుగా లేదుగా

Sudigali Sudheer’s Sarkaar 4 Promo: నలుగురు కుర్ర హీరోయిన్స్ తో సుధీర్ రచ్చ.. మాములుగా లేదుగా

Sudigali Sudheer’s Sarkaar Season 4 Show Promo: సుడిగాలి సుధీర్ ఎక్కడ ఉంటే ఎంటర్ టైన్మెంట్ అక్కడ ఉంటుంది. మ్యాజిక్ చేసుకుంటూ కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్.. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా రావడం, ఆనతి కాలంలోనే సుడిగాలి సుధీర్ అనే టీమ్ కు టీమ్ లీడర్ గా మారడంజరిగిపోయింది. అక్కడనుంచి అతని కెరీర్ ఊపందుకుంది. ప్రస్తుతం సుధీర్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క యాంకర్ గా కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సర్కార్ కొత్త సీజన్ కు సుడిగాలి సుధీర్ నే యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.


ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ గేమ్ షో ముందు మూడు సీజన్స్ కు ప్రదీప్ ఎనకర్ గా వ్యవహరించగా.. నాలుగో సీజన్ ను ఆడించడానికి ఆటగాడు దిగాడు. ఇక సుధీర్ రావడంతో ఎంటర్ టైన్మెంట్ డబుల్ అయ్యింది. అతడి పులిహోర మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యి వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో తెలుగు ముద్దుగుమ్మలు సందడి చేశారు. లవర్ తో మంచి హిట్ అందుకున్న గౌరీ ప్రియ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రంతో హిట్ అందుకున్న శివాని, బబుల్ గమ్ సినిమాతో తెలుగుకు పరిచయమైన మానస చౌదరి.. ఇక తంత్రతో మంచి థ్రిల్ ఫీల్ ఇచ్చిన అనన్య నాగళ్ళ ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు.

Also Read: Sundar C: టాలీవుడ్ డైరెక్టర్స్ నా సీన్స్ కాపీ చేశారు.. ఖుష్బూ భర్త సంచలన వ్యాఖ్యలు


ఇక ఈ నలుగురు కుర్ర హీరోయిన్స్ తో సుధీర్ ఒక ఆట ఆడుకున్నాడు. వచ్చిన ప్రతి హీరోయిన్ కు రోజాపువ్వు ఇచ్చి మనసులో ఉన్నది నువ్వే అంటూ పులిహోర కలిపాడు. ఇక వారితో ఆటలు ఆడిస్తూనే వారి అందాన్ని పొగిడేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో చూసినవాళ్లందరూ.. అది సుధీర్ అన్న అంటే.. ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలంటే సుధీర్ తరువాతే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుధీర్ హీరోగా నటించిన గోట్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో సుధీర్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×