E-Paper
Advertisement

Hari Hara Veeramallu :హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది రిలీజ్ అయ్యేది అప్పుడే

Hari Hara Veeramallu :హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది రిలీజ్ అయ్యేది అప్పుడే
Advertisement

Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా సినిమాలు డిజాస్టర్ అయిన కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది తప్ప ఏ మాత్రం తగ్గలేదు. పదేళ్లు హిట్టు లేకపోయినా కూడా మార్కెట్ దెబ్బతినలేదు. అయితే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ కెరియర్లో వరుసుగా బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలు పడ్డాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు మామూలుగా ఉంటున్నాయి కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించేవి.

రీ ఎంట్రీ రీమేక్ లు

Advertisement

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్ట్రైట్ సినిమాలు కంటే కూడా తన కెరియర్ లో రీమేక్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా ఆ సినిమా తెరకెక్కింది. ఇక మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనమ్ కోషియం సినిమాకి రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. ఇక సముద్ర ఖని దర్శకత్వం వహించిన వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కింది. ఇప్పటివరకు రీయంట్రి తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన అన్ని సినిమాలు కూడా రీమేక్ సినిమాలు.

రెండు స్ట్రైట్ సినిమాలు

Advertisement

అంతేకాకుండా హరిష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది. ఒక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు అనే మరో సినిమా కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. క్రిష్ తో పాటు నిర్మాత ఏం రత్నం తనయుడు జై కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కూడా మంచి అంచనాలను పెంచింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది చిత్ర యూనిట్.

Hari Hara Veeramallu

ఎన్నోసార్లు వాయిదా

హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అది విపరీతంగా ఆకట్టుకుంది. చాలామందికి కేవలం పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలిసింది,ఇకపై ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలియనుంది అని అందరూ ఊహించారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ ఈ సినిమాలో కనిపిస్తుంది. బాబీ డియల్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఇప్పుడు మార్చి 28 రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×