BigTV English
Advertisement

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Boy Kidnapped Returns After 70 Years: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..

Boy Kidnapped Returns After 70 Years| 1951 సంవత్సరంలో ఒక పిల్లాడు కిడ్నాప్ అయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా కనిపించలేదు. అలా 70 ఏళ్లు గడిచిపోయాక.. అనుకోకుండా అతని గురించి తెలిసింది. కానీ అతనో కాదో అని అనుమానంగా ఉండడంతో కొంత పరిశోధన చేశాడు. పోలీసుల సాయంతో విచారణ చేశారు. ఎట్టకేలకు అప్పుడు చిన్నతనంలో తప్పిపోయిన వ్యక్తి ఇప్పుడు ముసలితనంతో ఇంటికి చేరాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. 1951 సంవత్సరంలో అమెరికా క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని వెస్ట్ ఓక్ ల్యాండ్ ఒక దంపతులకు రోజర్(10) , ఆల్బినో(6) అనే ఇద్దరు మగ పిల్లలుండేవారు. ఫిబ్రవరి 21న ఆ ఇద్దరు పిల్లలు ఇంటి సమీపంగా ఉన్న పార్కులో ఆడుకుంటుండగా.. ఒక మహిళ అక్కడికి వచ్చింది. ”ఇద్దరికీ స్వీట్లు తినిపిస్తాను నాతో రండి” అని చెప్పింది. రోజర్ తాను అడుకుంటాను అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. చిన్న వాడైనా ఆల్బినో మాత్రం తన స్వీట్లు ఇష్టమని ఆమెతో వెళ్లిపోయాడు. అలా వెళ్లిన పోయిన ఆల్బినో ఎప్పటికీ తిరిగిరాలేదు. అతని తల్లిదండ్రులు ఆల్బినో కోసం ఎంత వెతికినా లాభం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


కానీ విధి విచిత్రమైనది.. 73 ఏళ్ల తరువాత జూన్ 2024 లో రోజర్ కూతురు అలీడాకు అనుకోకుండా తన బాబాయ్ గురించి కొంత సమాచారం దొరికింది. ఆ వ్యక్తి తన తండ్రి సోదరుడేనని ఆమెకు అనుమానం కలిగింది. ఇదెలా జరిగిందంటే.. అమెరికాలో ‘AncestryDNA’, ’23andMe’ అనే డిఎన్ఏ టెస్టింగ్ సంస్థలు అమెరికా ప్రజల డిఎన్ఏ వివరాలను తన సంస్థ వెబ్ సైట్ లో పెడుతుంటారు. ఎవరైనా తమ వంశం, లేదా పూర్వీకుల గురించి తెలుసుకోవాలంటే తమ డిఎన్ఏని ఆన్‌లైన్ లో పోల్చుకోవచ్చు.

అలా ఒక రోజు రోజర్ కూతురు అలిడా తన డిఎన్ఏ కు ఆన్ లైన్ లో ఎవరితోనైనా పోలీకలు ఉన్నాయా?.. అని పరిశీలిస్తుండగా.. ఆమెకు లూయిస్ ఆర్మాండో ఆల్బినో అనే వ్యక్తి గురించి తెలిసింది. ఆల్బినో ఒక మజీ సైనికుడు. రెండు సార్లు అమెరికా తరపున వియత్నాం యుద్ధంలో పోరాడాడు. ఆ తరువాత ఫైర్ ఫైటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆల్బినో వివరాలు, అతని అడ్రస్ తెలుసుకొని అలిడా పోలీసులను ఆశ్రయించింది. తన డిఎన్ఏ.. ఆల్బినోతో 22 శాతం మ్యాచ్ అవుతూ ఉందని తెలిపి.. 1951లో ఆల్బినో కిడ్నాప్ అయినట్లు న్యూస్ పేపర్ లో వచ్చిన వార్త కటింగ్స్ ని చూపించింది.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

పోలీసులు ఆమెకు సాయం చేయడానికి అంగీకరించారు. అలా అలీడా.. ఈస్ట్ కోస్ట్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బాబాయ్ ఆల్బినోతో కలిసి జరిగినదంతా వివరించింది. ఆల్బినో కన్నీళ్లతో ఆమెను హత్తుకున్నాడు. వెంటనే క్యాలిఫోర్నియా వెస్ట్ ఓక్ ల్యాండ్ కు బయలుదేరి తన ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడ తన తల్లి లేదు. ఆమె 92 ఏళ్ల వయసులో 2005లో మరిణించిందని తెలిసి బాధపడ్డాడు. తన అన్న రోజర్‌కి ఇప్పడు 82 ఏళ్ల వయసు. రోజర్.. తన తమ్ముడిని చూసి ఏడుస్తూ కౌగిలించుకున్నాడు. అయితే నెల రోజుల క్రితం మరణించాడు.

ఈ కథ అంతా అలీడా ఒక మీడియా ఇంటర్ వ్యూలో తెలిపింది. తన తండ్రి రోజర్.. ఎప్పుడూ తన తమ్ముడి గురించి ఆలోచించి బాధపడే వారని.. ఆ రోజు పార్కు తాను జాగ్రత్తగా ఉండ ఉంటే తన తమ్ముడు తప్పిపోయేవాడు కాదని తరుచూ తనను తాను నిందించుకునేవాడని తెలిపింది. కానీ తన తండ్రి చనిపోయేముందు ఆ బాధ లేకుండా ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపింది.

Related News

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

Big Stories

×