E-Paper
Advertisement

Harish Shankar About Devi Sri Prasad: చాలా సినిమాలని ఒంటిచేత్తో నిలబెట్టిన దేవుడు

Harish Shankar About Devi Sri Prasad: చాలా సినిమాలని ఒంటిచేత్తో నిలబెట్టిన దేవుడు
Advertisement

Harish Shankar About Devi Sri Prasad: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో మొదలైన హరీష్ శంకర్ ప్రయాణం గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాతో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చే రేంజ్ వరకు ఎదిగింది. హరీష్ శంకర్ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ లో మిస్ అయిన ఎనర్జీ అంతటినీ కూడా తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టాడు. దీనికి కారణం స్వతహాగా హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వడం. గబ్బర్ సింగ్ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దేవిశ్రీప్రసాద్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే పవన్ కళ్యాణ్ కి జల్సా లాంటి కెరియర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు అని చెప్పాలి. జల్సా లో ప్రతి పాట ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పటికి విన్నా కూడా అర్థమవుతుంది. అలానే గబ్బర్ సింగ్ సినిమాకి కూడా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించాడు దేవి. అందుకని మళ్లీ వీరి కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ సినిమాకి కూడా దేవి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

దేవిశ్రీప్రసాద్ కెరియర్లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. దేవి మ్యూజిక్ లో కూడా ఒక రకమైన సిగ్నేచర్ ఉంటుంది. చాలా త్వరగా వర్క్ ఫినిష్ చేసి డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తుంటాడు దేవి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో దేవిశ్రీప్రసాద్ వర్క్ చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేసి తన మార్కు క్రియేట్ చేశారు. ఇకపోతే రీసెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ కన్సర్ట్ ఒకటి హైదరాబాద్ లో జరిగింది. దీనికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు అందులో హరీష్ శంకర్ ఒకరు. ఒక సందర్భంలో దేవిశ్రీప్రసాద్ హరీష్ శంకర్ ను స్టేజ్ మీదకు తీసుకెళ్లారు. అక్కడ స్టేజ్ పై హరీష్ శంకర్ దేవి గురించి కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు.

Advertisement

అమ్మ నాన్న , అమ్మవారి పేరు మీద దేవి శ్రీ ప్రసాద్ అని పేరు పెట్టారు కానీ … చాలా సినిమాలని ఒంటిచేత్తో నిలబెట్టిన దేవుడు….
ఎవరన్నా పైకొస్తే…
తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు అంటారు
కానీ తన వేళ్ల మీద ఎన్నో సినిమాలని నిలబెట్టాడు దేవి
ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం.

అంటూ చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. ఇక వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే హరీష్ కూడా చాలా సందర్భాల్లో ఈ సినిమా గబ్బర్ సింగ్ కంటే బెటర్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో ఇది ఒక బెస్ట్ సినిమా గా ఉంచాలి అనేది నా డ్రీమ్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు హరీష్. అలానే ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ తక్కువ రోజులు సమయాన్ని కేటాయించిన కూడా అద్భుతమైన కంటెంట్ తీసుకొచ్చాడు హరీష్. కేవలం కొన్ని రోజులు సూట్ లోనే రెండు టీజర్ను కూడా బయటకు విడిచిపెట్టాడు. ఈ రెండు టీజర్లు కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చాలామంది మంచి నమ్మకాలతో ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×