BigTV English
Advertisement

Skn : రాజా సాబ్ విషయంలో మారుతిని బానే ఇరికించాడు

Skn : రాజా సాబ్ విషయంలో మారుతిని బానే ఇరికించాడు

Skn : ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసి నిర్మాత స్థాయి వరకు ఎదిగారు. సినిమాని ప్రేమించడం ఎస్ కే ఎన్ కు బాగా తెలుసు. ఒక కథను నమ్మి దానికోసం ఎంత రిస్క్ అయినా చేయడం నిర్మాతగా తన అలవాటైపోయింది. బేబీ సినిమాకు ముందు తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నా ఒక ఇల్లును కూడా అమ్ముకున్నాడు. ఒక దర్శకుడు పైన ఆయన పెట్టుకున్న నమ్మకం అలాంటిది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బేబీ సినిమా బీభత్సమైన ఘనవిజయాన్ని సాధించి దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడితో మళ్ళీ స్టార్ హీరోస్ అంటూ కాకుండా మినిమం గ్యారంటీ ఉన్న సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు ఎస్ కే ఎన్. కానీ ఇదంతా ఎస్ కే ఎన్ ప్రొఫెషనల్ లైఫ్.


ఇకపోతే ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు ఎస్ కే ఎన్. కొన్నిటికి చాలా ధీటుగా సమాధానం చెబుతుంటాడు. అవతల వాడికి మాట్లాడే ఛాన్స్ లేకుండా ఆన్సర్స్ చెప్పడం ఎస్ కే ఎన్ కి వెన్నతో పెట్టిన విద్య. స్టేజ్ పైన పంచులు ప్రాసలు వాడే ఎస్కేఎన్ ఎవరికైనా సమస్య ఉంది అని తెలిస్తే తన వంతు సాయాన్ని అందజేస్తాడు. ఎస్ కే ఎన్ కి మారుతికి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో చాలామందికి తెలిసిన విషయమే. ఈ రోజుల్లో సినిమా నుంచి వీరిద్దరి ప్రయాణం మొదలైంది. మారుతి(Maruthi) దర్శకుడుగా చేసిన ఈ రోజుల్లో(Eerojullo) సినిమా ఆరోజుల్లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత మినిమం గ్యారంటీ సినిమాలు తన కెరీర్లో చేసుకుంటూ వెళ్ళాడు మారుతి. ఇప్పటివరకు మారుతి కెరియర్ లో డిజాస్టర్ అయిన సినిమా ఒకటి కూడా లేదని చెప్పాలి.

ఇక లైఫ్ లో ఫస్ట్ టైం మారుతి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా రాజా సాబ్(Raaja Saabh) అనే సినిమాను చేస్తున్నాడు మారుతి. ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రభాస్ లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఈ సినిమాలో బయటికి తీయనన్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. ఇకపోతే అఫీషియల్ గా ఎస్ కే ఎన్ అని కూడా మారుతిని ఇరికించాడు. ట్విట్టర్ వేదికగా ప్రభాస్ బర్త్ డే అంటే కటౌట్లు ఉంటాయి బ్యానర్లు ఉంటాయి. మనమే ఎందుకని కొత్త లుక్ రిలీజ్ చేయకూడదు అంటూ మారుతి ను ట్యాగ్ చేసాడు.


ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకీ సినిమాలోని ఒక టెంప్లెట్ ని జోడించి ఈ పోస్ట్ చేశాడు ఎస్ కే ఎన్. ఈ పోస్ట్ తో చాలామంది ప్రభాస్ అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది కచ్చితంగా ప్రభాస్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని ఫుల్ జోష్ మీద ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాని రీ రిలీజ్ కూడా చేస్తున్నారు. చాలా రీ రీలీజ్ లను ఇప్పటివరకు ప్రేక్షకులు ఆదరించారు మరి ఈ సినిమాకు ఎంతటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×