E-Paper
Advertisement

Harom Hara: షూటింగ్ పూర్తి.. రిలీజ్ కు సిద్ధం

Harom Hara: షూటింగ్ పూర్తి.. రిలీజ్ కు సిద్ధం
Advertisement

Harom Hara: ప్రస్తుతం టాలీవుడ్ భారీ హిట్ అందుకోవాల్సిన హీరోల్లో సుధీర్ బాబు కూడా ఉన్నాడు. మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా సుధీర్ కు హిట్ అందిందే లేదు. డిఫరెంట్ గానే కాకుండా కొన్ని ప్రయోగాలు చేసినా కూడా విజయం మాత్రం అందలేదు. అయినా కూడా సుధీర్ వెనుకడుగు వేయలేదు.

ప్రస్తుతం సుధీర్ బాబు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హరోంహర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నేటితో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఒక వీడియో ద్వారా అధికారికంగా తెలిపారు.

Advertisement

త్వరలోనే థియేటర్లలో సుబ్రహ్మణ్యం మాస్ సంభవం సుసేకి సిద్ధంగా ఉండండా అంటూ చిత్ర బృందం మొత్తం షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం వేసవి కానుకగా హరోంహర రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈసారైనా సుధీర్ బాబు హిట్ అందుకుంటాడో .. లేదో తెలియాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×