IPL 2024 Sunrisers Hyderabad Won the Match Against Delhi Capitals: ఐపీఎల్ సీజన్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారి పాయింట్ల టేబుల్ పట్టికలో నెంబర్ 2 ప్లేస్ కి వెళ్లింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయ దుందుభి మోగించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఎప్పటిలా 266 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో 67 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.
267 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ కి శుభారంభం లభించలేదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా (16) త్వరగా అవుట్ అయ్యాడు.
ఫస్ట్ డౌన్ వచ్చిన జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ మాత్రం చితక్కొట్టాడు. కేవలం 18 బంతుల్లో 65 పరుగులు చేశాడు. గెలుపుపై అందరిలో ఆశలు రేపాడు. ఇందులో 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. తను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు హైదరాబాద్ బౌలింగు చెల్లా చెదురైపోయింది. తనకి అభిషేక్ పోరెల్ సపోర్ట్ చేశాడు. తను 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వీరిద్దరూ క్రీజులో ఉండగా 12.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఢిల్లీ లక్ష్యం వైపు వెళుతున్నట్టే కనిపించింది.
Also Read: ధోనీ వస్తే.. ఆ రీసౌండే వేరబ్బా: డికాక్ భార్య
కానీ వీరు అవుట్ కావడంతో ఒక్కసారి పికప్ పడిపోయింది. దాన్ని పెంచే క్రమంలో రిషబ్ పంత్ (44) అవుట్ అయ్యాడు. తర్వాత ఇద్దరు డక్ అవుట్లు, ఒకరు 6, ఒకరు 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 19.1 ఓవర్ లో 199 పరుగులకు ఢిల్లీ ఆల్ అవుట్ అయ్యింది. 67 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించింది.
2024 సిరీస్ మొత్తమ్మీద ఓపెనర్ డేవిడ్ వార్నర్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. మొత్తం 7 మ్యాచ్ లు ఆడి 167 పరుగులు మాత్రమే చేశాడు.
హైదరాబాద్ బౌలింగులో టి.నటరాజన్ 4, వాషింగ్టన్ సుందర్ 1, భువనేశ్వర్ 1, మయాంక్ 2, నితీష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన 131 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ ని అందించింది. ట్రావెస్ హెడ్ మరోసారి అద్భుతంగా ఆడాడు. 32 బంతుల్లో 6 సిక్సర్లు, 11 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో సెంచరీ చేస్తాడనుకుంటే దురదృష్టవశాత్తూ కులదీప్ యాదవ్ బౌలింగులో అవుట్ అయ్యాడు.
Also Read: Pak vs NZ : మూడో మ్యాచ్ కివీస్‌దే, బాబర్ హిస్టరీ క్రియేట్, నాలుగో ప్లేస్‌లో రోహిత్
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా దుమ్ము దుమారం రేపాడు. 12 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మార్ క్రమ్ (1), క్లాసెన్ (15) చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ 27 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
అటు తర్వాత షాబాజ్ అహ్మద్ జట్టు భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. 29 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. తర్వాత అబ్దుల్ సమద్ (13) అవుట్ కావడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఎప్పటిలా భారీ స్కోరు 266 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగులో కులదీప్ 4, ముఖేష్ కుమార్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో హైదరాబాద్ టాప్ 2 లో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 7వ స్థానంలో ఉంది.