BigTV English

America: చైనాకు షాక్ ఇచ్చిన అమెరికా.. పాక్‌కు సాయం చేసిన కంపెనీలపై నిషేధం

America: చైనాకు షాక్ ఇచ్చిన అమెరికా.. పాక్‌కు సాయం చేసిన కంపెనీలపై నిషేధం

America: పాకిస్తాన్ కు బాలిస్టిక్ క్షిపణి విడిభాగాలను అందించినందుకుగాను చైనాకు చెందిన కంపెనీలపై అగ్రరాజ్యం అమెరికా గట్టిగానే బదులిచ్చింది. పాక్ కు సాయం చేసినందుకుగాను ఆయా కంపెనీలను బ్యాన్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.


మూడు చైనా కంపెనీలను, ఓ బెలారస్ కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. పాకిస్తాన్ కు బాలిస్టిక్ క్షిపణి విడిభాగాలను ఆయా కంపెనీలు అదించినందుకుగాను బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు.

చైనాకు చెందిన లాంగ్ డే టెక్నాలజీ డెవలప్‌మెంట్ కీ, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాన్ పెక్ట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలను అమెరికా నిషేధించింది. వీటితో పాటుగా మిన్క్స్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ ఆఫ్ బెలారస్‌ను కూడా అగ్రరాజ్యం నిషేధించింది.


పాకిస్తాన్‌కు ఈ కంపెనీలు అందజేస్తున్న సహాయం ద్వారా.. బాలిస్టిక్ క్షిపణుల ఆయుధాల తయారీ, రవాణాకు పాల్పడితే సమస్యగా మారే అవకాశం ఉందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా పాక్‌కు సహాయం చేస్తున్న సంస్థలపై నిషేధం విధించినట్లు తెలిపింది.

పాకిస్తాన్ కు మిత్రదేశమైన చైనా.. ప్రధానంగా ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులను అందిస్తోందని మాథ్యూ మిల్లర్ తెలిపారు. అయితే ఆయుధాల ప్రొక్యూర్మెంట్‌ను తాము వ్యతిరేకిస్తున్నాని.. ఆయుధాల సరఫరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Also Read: Elon Musk confirmed: భారత్ టూర్ వాయిదా, కాకపోతే..

పాక్‌కు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌కు కావాల్సిన ఛాసిస్‌ను.. మిన్స్క్ వీలి ట్రాక్టర్ ప్లాంట్ సరఫరా చేస్తోందని అమెరికా స్పష్టం చేసింది. మిస్సైల్‌కు చెందిన వైండింగ్, ఫిల్మెంట్ వైండింగ్ మెషీన్లు, స్టిర్ వెల్డింగ్ ఎక్విప్మెంట్‌ను చైనాకు చెందిన సంస్థలు అందజేస్తున్నట్లు అమెరికా తెలిపింది.

Related News

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Earthquake: సౌత్ అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం.. 7.5గా నమోదు

Karachi city: జలదిగ్బంధంలో కరాచీ సిటీ.. వెంటాడుతున్న వర్షాలు, నిలిచిన విద్యుత్, ఆపై అంధకారం

America Tariffs: రష్యాపై ఒత్తిడికోసమే భారత్ పై సుంకాల మోత.. అసలు విషయం ఒప్పుకున్న అమెరికా

Spain Wildfires: స్పెయిన్‌లో కార్చిచ్చు.. 20 ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు.. ఇదిగో వీడియో..

Afghanistan: బస్సులో చెలరేగిన మంటలు.. 71 మంది సజీవదహనం!

Big Stories

×