E-Paper
Advertisement

Harsha Sai : హర్ష సాయి ఆచూకీ లభ్యం… ప్రపంచ యాత్రికుడితో కలిసి అడ్డంగా బుక్ అయ్యాడుగా

Harsha Sai : హర్ష సాయి ఆచూకీ  లభ్యం… ప్రపంచ యాత్రికుడితో కలిసి అడ్డంగా బుక్ అయ్యాడుగా
Advertisement

Harsha Sai : పాపులర్ యూట్యూబర్ హర్ష సాయి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటిదాకా అతను ఎక్కడున్నాడో పోలీసులు కనిపెట్టలేకపోయారు. కానీ తాజా సమాచారం ప్రకారం హర్ష సాయి ఆచూకీ తెలిసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అది కూడా ఓ పాపులర్ యూట్యూబర్ తో అతను అడ్డంగా బుక్ అయ్యాడని తెలుస్తోంది. మరి హర్ష సాయి ఎక్కడున్నాడు? అనే వివరాల్లోకి వెళితే…

పాపులర్ యూట్యూబర్ తో అడ్డంగా బుక్ అయిన హర్ష సాయి

Advertisement

యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హర్ష సాయి ‘మెగా’ అనే సినిమాతో హీరోగా లంచ్ కావడానికి ట్రై చేశాడు. కానీ అంతలోనే వరుస వివాదాలతో ఇప్పుడు కంటికి కనిపించకుండా పరారయ్యాడు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే కారణంతో వివాదంలో చిక్కుకున్న హర్ష సాయి, తాజాగా అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు కోట్లు తీసుకుని మోసం చేశాడని, తనపై అత్యాచా*రం చేశాడంటూ రీసెంట్ గా ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది. దీంతో అతనిపై ఇప్పటికే సెక్షన్ 376, 354 కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా హర్ష సాయి ఈ వివాదంపై డైరెక్ట్ గా ఎక్కడా మాట్లాడలేదు. పైగా పరారీలో ఉన్న ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన విదేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందంటూ మరో కంప్లైంట్ నమోదయింది. అయితే తాజాగా హర్ష సాయి ఆచూకీ లభ్యమైంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రపంచ యాత్రికుడు అంటూ యూట్యూబ్ లో పాపులర్ అయిన ఒక యూట్యూబర్ తో కలిసి హర్ష సాయి విదేశాలకు వెళ్లిపోయాడని, అతని దగ్గరే తల దాచుకుంటున్నాడనే రూమర్ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలీదు గానీ, పోలీసులు హర్షతో పాటు ఆ యూట్యూబర్ పై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హర్ష సాయితో పాటు ఆ యూట్యూబర్ కూడా అడ్డంగా బుక్ అవ్వడం విశేషం. గతంలో హర్ష సాయి హెల్ప్ స్కామ్ గురించి సదరు యూట్యూబరే బయట పెట్టారు.

Advertisement

ఆడియోలతో పని కానిచ్చేస్తున్న హర్ష సాయి

తనపై అత్యాచార ఆరోపణలు రాగానే సోషల్ మీడియా వేదికగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలోనే నిజం బయటపడుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసి వదిలేసాడు హర్ష సాయి. ఆ తర్వాత అంతా అతని లాయర్ చూసుకుంటాడు అంటూ కనిపించకుండా పోయాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సదరు బాధిత యువతకి, తనకు మధ్య అసలు ఏం జరిగింది ? అనే విషయాన్ని ఆడియోల రూపంలో బయట పెడుతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ షాకింగ్ ఆడియోలో తనకు, ఆ యువతికి మధ్య నడిచిన రొమాంటిక్ డిస్కషన్ ని బయట పెట్టి షాక్ ఇచ్చాడు. కానీ చాలా వరకు ఆయన రిలీజ్ చేసే ఆడియోలలో అమ్మాయి వాయిస్ మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాడంతో అతను ఎడిట్ చేసే రిలీజ్ చేశాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి పోలీసులు ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? చివరికి ఏం జరుగుతుంది? అనేది చూడాలి.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×