Amazon Smart Watch Sale : అమెజాన్… గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచెస్ పై బెస్ట్ ఆఫర్స్ ను ప్రకటించింది. ఇప్పటికే ఆపిల్ తాజాగా లాంఛ్ చేసిన వాచ్ సిరీస్ 10పై భారీ తగ్గింపును అందించి ఈ సంస్థ.. తాజాగా టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే డీల్స్ ను తీసుకొచ్చింది.
ఫెస్టివల్ సేల్ లో భాగంగా అమెజాన్ స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించింది. ఆపిల్, సామ్ సాంగ్, ఆమ్జ్ ఫిట్, వన్ ప్లస్ స్మార్ట్ వాచెస్ పై టాప్ ఆఫర్స్ ను ఇస్తుంది. Amazfit, OnePlus వాచెస్ పై సైతం భారీ డిస్కౌంట్ ఉండగా… SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఈఎమ్ఐ లావాదేవీలపై 10 శాతం ఇనిస్టెంట్ డిస్కౌంట్ ను పొందొచ్చు.
ఆపిల్ కంపెనీ గ్రాండ్ గా రిలీజ్ చేసిన వాచ్ సిరీస్ 10పై ఇప్పటికే అమెజాన్ సేల్ లో బెస్ట్ డీల్ నడుస్తుంది. ఇక 4G సపోర్ట్ తో కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు, మ్యూజిక్, మ్యాప్స్ కు సపోర్ట్ చేసే ఎనేబుల్ స్మార్ట్ వాచెస్ లో బెస్ట్ వెర్షన్ గా ఉన్న సామ్ సాంగ్ గేలక్సీ వాచ్ 4 LTE అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం ఈ వాచ్ మార్కెట్ ధర రూ. 42,999గా ఉండగా.. అమెజాన్ లో భారీ తగ్గింపుతో రూ. 8,099గా ఉంది.
ALSO READ : స్పెషల్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్… ప్రోసెసర్, కెమెరా ఫీచర్స్ అదుర్స్ గురూ!
Apple Watch Ultra – ఈ వాచ్ ప్రస్తుత ధర రూ. 89,990 ఉండగా ఆఫర్లో రూ. 69,999కే అందుబాటులో ఉంది.
Apple Watch Series 10 – Apple Watch Series 10 ప్రస్తుత ధర రూ. Rs. 49,990 ఉండగా ఆఫర్లో రూ. 46,990కే అందుబాటులో ఉంది.
Samsung Galaxy Watch 4 LTE – Samsung Galaxy Watch 4 LTE ప్రస్తుత ధర రూ. 42,999 ఉండగా ఆఫర్లో రూ. 8,099కే అందుబాటులో ఉంది.
Samsung Galaxy Watch 4 BT – ఈ వాచ్ ప్రస్తుత ధర రూ. 26,999 ఉండగా ఆఫర్ లో రూ. 6,999కే అందుబాటులో ఉంది.
OnePlus Watch 2R – ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుత ధర రూ. 19,999 ఉండగా ఆఫర్ లో రూ. 12,999కే అందుబాటులోకి వచ్చింది.
Amazfit Active Edge – ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుత ధర రూ. 19,999 ఉండగా ఆఫర్ లో రూ.4,799కే అందుబాటులోకి వచ్చింది.
Amazfit Active Smart – ఈ స్మార్ట్ వాచ్ ప్రస్తుత ధర రూ. Rs. 19,999 ఉండగా ఆఫర్ లో రూ.4,799కే అందుబాటులోకి వచ్చింది.
Amazfit Balance – ఈ వాచ్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. Rs. 30,999 ఉండగా ఆఫర్లో రూ.16,499కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వీటితో పాటూ ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్స్, ఫ్రిడ్డ్, స్మార్ట్ టీవీ, వాషింగ్ మెషిన్స్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది అమెజాన్. సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సేల్… అక్టోబర్ 6వరకూ అందుబాటులో ఉంది. ఇక హోమ్ తో పాటు గాడ్జెట్ సెటప్ ను సైతం అధునాతనంగా మార్చాలనుకునే కస్టమర్స్ ఓ లుక్కేయండి.