BigTV English
Advertisement

Harsha Sai : హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ… అవన్నీ రూమర్లేనా?

Harsha Sai : హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ… అవన్నీ రూమర్లేనా?

Harsha Sai : తెలుగు యూట్యూబర్ హర్ష సాయి అత్యాచారం చేయడంతో పాటు న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడని కొన్ని రోజుల క్రితం పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాదం బయటకు వచ్చిన క్షణం నుంచి హర్ష సాయి కనిపించకుండా పోయాడు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తనపై వచ్చిన ఆరోపణలన్ని అబద్ధం అంటూ కామెంట్స్ చేస్తున్న హర్ష సాయి రీసెంట్ గా కొన్ని ఆడియోలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలీదు గానీ గత కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న హర్ష సాయి మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.


హర్ష సాయిపై లుక్ అవుట్ నోటీసులు జారీ

‘ మెగా’ మూవీ కాపీరైట్స్ కోసమే తనపై హర్ష సాయి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో బాధితురాలు వెల్లడించింది. ఈ సినిమాలో హర్ష సాయి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సదరు నటి ఫిర్యాదు నేపథ్యంలో హర్ష సాయిని అరెస్ట్ చేయడానికి నార్సింగ్ పోలీసులు పలుచోట్ల ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇక చాలా రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్ష సాయి దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు అంటూ గతంలోనే బాధితురాలు పోలీసులకు మరో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే.


అవన్నీ రూమర్లేనా ?

అయితే ఇప్పటిదాకా హర్ష సాయి కనిపించకుండా పోవడం వెనక ఒక ప్రపంచ యాత్రికుడి హస్తం ఉందంటూ వార్తలు వినిపించాయి. గతంలో హర్ష సాయికి అతనితో గొడవ జరగగా, హర్ష సాయి మళ్లీ అతని దగ్గరికే వెళ్ళి తలదాచుకున్నాడని రూమర్లు వినిపించాయి. కానీ తాజాగా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో అవన్నీ రూమర్లే అనే అనుమానం కలుగుతోంది. మరి ఎవరికీ కనిపించకుండా హర్ష సాయి ఎక్కడ దాక్కున్నాడు? పోలీసులు అతన్ని ఎలా పట్టుకోబోతున్నారు ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా మరోవైపు హర్ష సాయి, అతని తండ్రి ముందస్తు బెయిల్ కి అప్లై చేయగా, తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టేసినట్టు తెలుస్తోంది.

మరో కొత్త కేసు 

ఈ నేపథ్యంలోనే బాధిత యువతి కొంతమంది చేత హర్ష సాయి తనపై కావాలని అసభ్యకరంగా కామెంట్స్ చేయిస్తూ, యూట్యూబ్ ఛానల్స్ ని ఉపయోగించుకొని తనపై కొత్త రూమర్స్ స్ప్రెడ్ చేయిస్తున్నాడు అంటూ కొత్త కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై కూడా కేసు ఫైల్ చేసిన పోలీసులు హర్ష సాయిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇక హర్ష సాయి దొరికితే ఈ వివాదానికి ఎండ్ కార్డు పడుతుంది. అప్పటిదాకా ఇలా రోజుకో రూమర్ తో హర్ష సాయి వివాదం నడుస్తుంది. అయితే ఆయన అభిమానులు కూడా తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కుంటున్నాడు? అని ప్రశ్నిస్తున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×