BigTV English

Swag OTT: శ్రీ విష్ణు ‘స్వాగ్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే?

Swag OTT: శ్రీ విష్ణు ‘స్వాగ్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే?

Swag OTT: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు రీసెంట్ గా ‘స్వాగ్ ‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మొదటి రోజునే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లింగవివక్ష పాయింట్‌కు కామెడీని జోడించి దర్శకుడు హసిత్ గోలి ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించి సక్సెస్ ను అందుకున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగా వసూల్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. అయితే స్వాగ్ మూవీ ఓటీటీ అనౌన్స్ మెంట్స్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


శ్రీ విష్ణు మొదటి నుంచి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. గతంలో చేసిన సినిమాలన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మొన్నీమధ్య వచ్చిన ‘ఓం భీం బుష్ మూవీ’ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు వచ్చిన ప్రయోగాత్మక మూవీ స్వాగ్ కూడా హిట్ టాక్ ను అందుకుంది. ఇక స్వాగ్ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందన్న విషయం తెలిసిందే. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు. నవంబర్ సెకండ్ వీక్‌లో స్వాగ్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫ్యాన్సీ రేటుకు స్వాగ్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు టాక్..

స్వాగ్ మూవీ విషయానికొస్తే.. ఈ మూవీలో శ్రీ విష్ణు ఐదు విభిన్న పాత్రల్లో నటించారు. రీతూ వర్మ రెండు క్యారెక్టర్స్‌ చేసింది. ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్లు అనే భేదాలు లేకుండా సొసైటీలో అందరూ సమానమనే సున్నితమైన అంశాన్ని ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వాగ్ మూవీలో చక్కగా చూపించాడు డైరెక్టర్.. ఎక్కడా మనోభావాలను తీసేలా స్టోరీని చూపించకుండా నవ్విస్తూనే కథను లాక్కొచ్చాడు. అదే జనాలను థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ కి జనాల్లో మంచి స్పందన వస్తుంది. చాలా పాత్రలు ఉండటం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కన్ఫ్యూజింగ్‌గా సాగడం స్వాగ్‌కు మైనస్‌గా మారింది. శ్రీవిష్ణు నటనపై మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి.. ఇక మీరా జాస్మిన్ చాలా ఏళ్ల తరువాత ఈ మూవీలో మెరిసింది. రీతూ వర్మ యాక్టింగ్ అదుర్స్.. ప్రతి ఒక్కరు కూడా సినిమా పై పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్ పడినట్లే అని తెలుస్తుంది.


 

Related News

OTT Movie : స్టార్ హీరోలెవ్వరూ చేయని సాహసాలు… హర్రర్ నుంచి సస్పెన్స్ దాకా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

OTT Movie : ఆడవాళ్లందరినీ వదిలేసి బొమ్మతో… చివరికి ఆ పని కూడా దాంతోనే… ఊహించని ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

OTT Movie : ఈ అమ్మాయిని ప్రేమిస్తే కుక్క చావే… మగవాళ్ళను దగ్గరకు రానివ్వని దెయ్యం… గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

OTT Movie : క్షుద్ర పూజలతో మేల్కొలుపు… అంతులేని ఆకలున్న దెయ్యం ఇది… కామెడీతో కితకితలు పెట్టే తెలుగు హర్రర్ మూవీ

Chiranjeevi : భారీ ధరకు అమ్ముడుపోయిన మెగా 157 ఓటీటీ హక్కులు.. అక్కడే స్ట్రీమింగ్!

Telugu Web Series: ప్రేమలో తొందరపాటు.. ప్రియుడిని ముక్కలు చేసి డ్రమ్ములో వేసే ప్రియురాలు, కొత్త సీరిస్ సిద్ధం

Big Stories

×