BigTV English

iQoo Z9 Turbo+ 5G: ఇచ్చిపడేసిన ఐక్యూ.. పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+ 5G: ఇచ్చిపడేసిన ఐక్యూ.. పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+ 5G price: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐక్యూ కొత్త ఫోన్ తాజాగా లాంచ్ అయింది. తన లైనప్‌లో ఉన్న కొత్త iQoo Z9 Turbo+ 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సెప్టెంబర్ 24న చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6400mAh బ్యాటరీ, 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ (IR) సెన్సార్ కూడా అందించబడింది. కాగా ఇది Q1 గేమింగ్ చిప్‌తో కూడిన MediaTek డైమెన్సిటీ 9300+ SoCను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించబడింది. ఇది Android 14-ఆధారిత iQoo కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది. ఇప్పుడు ఈ iQoo Z9 Turbo+ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


iQoo Z9 Turbo+ 5G Specifications

iQoo Z9 Turbo plus 5G స్మార్ట్‌ఫోన్ 6.78-అంగుళాల 1.5K (1,260 x 2,800 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDRకి మద్దతు ఇస్తుంది. ఈ కొత్త iQoo ఫోన్ MediaTek Dimensityu 9300+ SoC ప్రాసెసర్‌ని కలిగి ఉంది. దీనితో కంపెనీ Q1 గేమింగ్ చిప్‌సెట్‌ను కూడా అందించింది. ఈ చిప్‌సెట్ గరిష్టంగా 16GB వరకు LPDDR5X RAM + 512GB వరకు UFS4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా iQoo Z9 Turbo+ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.


ఇందులో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 CMOS ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అదే సమచయంలో ఇది 20x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. iQoo Z9 Turbo+ బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. ఇందులో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6400mAh బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయంలో డ్యూయల్ 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, OTG, GPS, USB టైప్-C (2.0) పోర్ట్‌తో సహా మరిన్ని ఫీచర్లు అందించారు. ఇక ఫోన్ సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

Also Read: రెడ్‌మి హవా.. కె80 సిరీస్‌లో మరో రెండు ఫోన్లు, లాంచ్ ఎప్పుడంటే?

iQoo Z9 Turbo+ 5G Price

iQoo Z9 Turbo+ 5G నాలుగు వేరియంట్లలో చైనాలో విడుదల అయింది. అందులో బేస్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్ (సుమారు రూ. 27,300) నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో దాని 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2599 యువాన్ (సుమారు రూ.30,900), 16జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2499 (సుమారు రూ.29,70).

ఇక దీని టాప్-ఆఫ్-ది-లైన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్ (సుమారు రూ. 34,500)గా కంపెనీ నిర్ణయించింది. ఇది మిడ్‌నైట్ బ్లాక్, మూన్ షాడో టైటానియం, స్టార్‌లైట్ వైట్ వంటి కలర్ ఆప్షన్లో అందుబాటులోకి వచ్చింది. చైనాలోని Vivo ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం iQoo భారతదేశంలో దాని లాంచ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×