E-Paper
Advertisement

HBD Prabhas : ప్రభాస్ పుట్టిన రోజున ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన మేకర్స్… ఇద్దరూ అదే పని

HBD Prabhas : ప్రభాస్ పుట్టిన రోజున ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన మేకర్స్… ఇద్దరూ అదే పని
Advertisement

HBD Prabhas : ఈరోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas: స్టార్ హీరోయిన్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వని ప్రభాస్… ఆమెకు తక్కువైంది ఇదేనట!?) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుసగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఆయన హీరోగా నటిస్తున్న రెండు సినిమాల నుంచి మాత్రమే అప్డేట్స్ వచ్చాయి. మరో రెండు సినిమాల విషయంలో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇలా ప్రభాస్ అభిమానులను ఆయన పుట్టినరోజున డిసప్పాయింట్ చేసిన వారిలో డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి ఉన్నారు.

డార్లింగ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ 

Advertisement

రీసెంట్ గా ‘సలార్ 2’, ‘కల్కి’ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్  అందుకున్న ప్రభాస్ ఖాతాలో ప్రస్తుతం అరడజను సినిమా ఉన్నాయి. అందులో హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో సినిమా, అలాగే సందీప్ రెడ్డి వంగాతో ఆయన మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ ఉంటుందని ఎదురు చూశారు ప్రభాస్ అభిమానులు. కానీ ఇద్దరు మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకుండా కేవలం బర్త్ డే విషెస్ తో సరిపెట్టారు. ‘పడి పడి లేచే మనసు, సీతారామం, అందాల రాక్షసి’ వంటి మంచి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్ తో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ నుంచి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్ర బృందం ముందుగానే ప్రకటించింది. కానీ తీరా చూస్తే ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా, మరో స్పెషల్ అకేషన్ రోజున ట్రీట్ ఇస్తామంటూ హామీ ఇచ్చి అభిమానులను నిరాశపరిచారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) పోస్టర్ తో కేవలం బర్త్ డే విషెస్ చెప్పి సరిపెట్టారు. కనీసం ఆ పోస్టర్ లో ప్రభాస్ ఫోటో కూడా లేదు. ఇలా డార్లింగ్ పుట్టినరోజు నాడు ఆయన అభిమానులకు సందీప్ రెడ్డి వంగా, హను రాఘవ పూడి షాక్ ఇచ్చారు.

Advertisement

ప్రభాస్ బర్త్ డే అప్డేట్స్

ప్రభాస్ (Prabhas) పుట్టిన రోజును అభిమానులు మరింత సంతోషంగా జరుపుకోవడానికి కారణమయ్యారు డైరెక్టర్స ప్రశాంత్ నీల్, మారుతి. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు నుంచి హడావుడి మొదలైంది. ఇక ఈ రోజు స్పెషల్ గా ప్రభాస్ కొత్త లుక్ ను రివీల్ చేశారు. రెస్పాన్స్ ఎలా ఉందనే సంగతిని పక్కన పెడితే కనీసం మారుతి చేసిన సందడి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. అలాగే ‘సలార్ 2’ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ హోంబలే బ్యానర్ ప్రకటించి మరో గుడ్ న్యూస్ చెప్పింది డార్లింగ్ ఫ్యాన్స్ కు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×