BigTV English

This Week Releases: ఈవారం సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. ‘పొట్టేల్’పై ఎక్కువ కత్తెర్లు, ఆ డైలాగ్స్ అన్నీ కట్

This Week Releases: ఈవారం సినిమాల సెన్సార్ సర్టిఫికెట్స్ ఇవే.. ‘పొట్టేల్’పై ఎక్కువ కత్తెర్లు, ఆ డైలాగ్స్ అన్నీ కట్

This Week Releases: అక్టోబర్ మొదలయినప్పటి నుండి ఎన్నో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. శుక్రవారం వచ్చిందంటే చాలు.. దాదాపు అరడజను చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అక్టోబర్ 25న కూడా అరడజను తెలుగు సినిమాలతో పాటు ఒక ఇంగ్లీష్ మూవీ కూడా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సెర్టిఫికెట్స్ బయటికొచ్చాయి.


లగ్గం

ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘లగ్గం’. టైటిల్‌కు తగినట్టుగానే ఈ సినిమా అంతా ఒక పెళ్లి చుట్టూ తిరుగుతుంది. రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించిన ఈ మూవీ.. అక్టోబర్ 25న విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో సాయి రోనక్ హీరోగా నటించగా ప్రగ్యా నగ్రా హీరోయిన్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని వారు కూడా ‘యూ’ సెర్టిఫికెట్ ఇచ్చారు. ‘లగ్గం’ మూవీలో అస్సలు కట్స్ లేకపోవడం విశేషం.


Laggam Censor Certificate
Laggam Censor Certificate

సముద్రుడు

అక్టోబర్ 25న విడుదవుతున్న చిన్న సినిమాల్లో ‘సముద్రుడు’ కూడా ఒకటి. ఈ మూవీలో రమాకాంత్ బదవత్ హీరోగా నటించగా అవంతిక మున్నీ హీరోయిన్‌గా నటించింది. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. నగేశ్ నరదాసి దర్శకత్వం వహించిన ఈ మూవీ తాజాగా సెన్సార్ సెర్టిఫికెట్ సంపాదించుకుంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సముద్రుడు’కు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. పల్లెటూరిలో ఉపయోగించే బూతు పదాలు, ఇండియా గురించి తక్కువ చేసే డైలాగ్స్‌ను కట్ చేసింది సెన్సార్.

Samudrudu Censor Certificate
Samudrudu Censor Certificate

నరుడి బ్రతుకు నటన

యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలు సూపర్ హిట్ అవ్వాల్సిందే. యూత్‌కు నచ్చే కథలే ఈరోజుల్లో సక్సెస్ ఫార్ములా అందిస్తున్నాయి. శివకుమార్ హీరోగా నటించిన ‘నరుడి బ్రతుకు నటన’ కూడా అదే కేటగిరికి చెందినది. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్. ‘నరుడు బ్రతుకు నటన’లో అయిదు కట్స్ చేసింది సెన్సార్ బోర్డ్. ముఖ్యంగా ఇందులోని ఇంగ్లీష్ బూతులను తొలగించింది.

Narudi Brathuku Natana Censor Certificate
Narudi Brathuku Natana Censor Certificate

సీ 202

హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సీ 202’ మూవీ కూడా ఇదే వారం విడుదల కానుంది. ఈ సినిమాలో మున్నా కాశీ హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్, సంగీతం కూడా అందించాడు. అంతే కాకుండా ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే తీసుకున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 25న విడుదల కాగా షారోన్ రియా హీరోయిన్‌గా నటించింది. ‘సీ 202’కు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమాలో హారర్ అంశాలు ఎక్కువగా ఉండడంతోనే ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు అర్థమవుతోంది.

C 202 Censor Certificate
C 202 Censor Certificate

ఎంత పనిచేశావ్ చంటి

అక్టోబర్ చివరి వారంలో విడుదల కానున్న సినిమాల్లో ‘ఎంత పనిచేశావ్ చంటి’ ఒకటి. ఇందులో ఒక హీరోకు ముగ్గురు హీరోయిన్లు. శ్రీనివాస్ ఉలిశెట్టికు జోడీగా దియా రాజ్, నిహారిక, శాంతిప్రియా నటించారు. యూత్‌ఫుల్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఉదయ్ కుమార్. ‘ఎంత పనిచేశావ్ చంటి’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. హీరోయిన్స్ మితిమీరిన ఎక్స్‌పోకింగ్‌పై కత్తెర వేశారు సెన్సార్ బోర్డ్. రేప్, సాయిబాబా లాంటి పదాలను మ్యూట్ చేశారు.

Yentha Pani Chesav Chanti Censor Certificate
Yentha Pani Chesav Chanti Censor Certificate

పొట్టేల్

ఈవారం విడుదల కానున్న ఎన్నో చిన్న సినిమాల్లో బాగా హైప్ సాధించుకున్న సినిమా ‘పొట్టేల్’. అక్టోబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కలిసి గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ఎక్కువ హైప్ మాత్రమే కాదు.. ఎక్కువ సెన్సార్ కత్తెర్లు కూడా ఈ చిత్రంపైనే పడ్డాయి. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రాగా ఇందులో మొత్తం 15 కట్స్ చేసింది సెన్సార్ బోర్డ్. ఎన్నో డైలాగ్స్‌ను కట్ చేసింది. దేవుడికి సంబంధించిన డైలాగ్స్, విజువల్స్ చాలావరకు కట్ అయ్యాయి.

Pottel Censor Certificate
Pottel Censor Certificate

వెనోమ్

ఈవారం విడుదల కానున్న ఎన్నో చిన్న తెలుగు సినిమాల మధ్య ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ కూడా విడుదల కానుంది. అదే ‘వెనోమ్ ది లాస్ట్ డ్యాన్స్’. వెనోమ్ ఫ్రాంచైజ్‌లో కూడా విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 25న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీనికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

Venom The Last Dance Censor Certificate
Venom The Last Dance Censor Certificate

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×