BigTV English

Aarthi Agarwal: ఆర్తీ అగర్వాల్ కెరీర్ ను నాశనం చేసింది అతడే.. టార్చర్ పెట్టి..

Aarthi Agarwal: ఆర్తీ అగర్వాల్ కెరీర్ ను నాశనం చేసింది అతడే.. టార్చర్ పెట్టి..

Aarthi Agarwal:ఇండస్ట్రీ.. ఒక రోజా పువ్వు లాంటింది. అందరికి పైన అందంగా కనిపించే పువ్వే కనిపిస్తుంది. కానీ, కింద ఉన్న ముళ్లు కేవలం నటించేవారికే తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఎన్నో కథలు.. చాలామందికి తెలియనివి, నమ్మలేనివి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో జరిగే కొన్ని కొన్ని నిర్ణయాలు వారి సొంతవి కావు అని చాలామందికి తెలియదు.


ఇండస్ట్రీలో అడుగుపెట్టే హీరోయిన్స్ లో సగం మంది ఆర్థిక పరిస్థితిల వలన వచ్చినవారు కొంతమంది అయితే.. ఇంట్లో తల్లిదండ్రులు ఫోర్స్ చేసి పంపినవారు ఇంకొంతమంది. అలాంటివారిలో శ్రీదేవి, షకీలా.. ఇలా చాలామంది ఉన్నారు. తల్లి బలవంతం చేయడం వలనే తాము సినిమాలోకి వచ్చామని వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక వీరి లిస్ట్ లో దివంగత నటి ఆర్తీ అగర్వాల్ కూడా ఒకరు. అయితే ఇక్కడ ఫోర్స్ చేసింది ఆమె తల్లి కాదు.. తండ్రి.

నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో ఆర్తీ అగర్వాల్ తెలుగుతెరకు పరిచయమైంది. కలువరేకుల్లాంటి కళ్లు, ముగ్దమనోహరమైన రూపం. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తీ కళ్లు చూసి వెంకటేష్ ఎలా అయితే మైమర్చిపోయాడో.. ప్రేక్షకులు సైతం ఆమె అందాన్ని చూసి అలాగే మైమరచిపోయారు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆర్తీకి టాలీవుడ్ పూలు వేసి మరీ ఆహ్వానించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్, తరుణ్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.


నటనలోకి బలవంతంగా అడుగుపెట్టినా.. ఉన్నాకొద్దీ తన పనినే ప్రేమించడం మొదలుపెట్టింది. ఇండస్ట్రీలో పుకార్లు అనేవి కామనే. రెండు సినిమాలు కలిసిచేస్తే వారిద్దరి మధ్య ఎఫైర్ అంటకట్టేస్తారు. అప్పట్లో తరుణ్ – ఆర్తీ ప్రేమించుకున్నారని, ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో వాళ్లు విడిపోయారని వార్తలు వచ్చాయి. కానీ, అదునులో నిజం లేదని తరుణ్ తల్లి రోజా రమణి క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

ఇక ఎంతో మంచిగా సాగే ఆమె జీవితాన్ని నాశనం చేసింది మాత్రం ఆమె తండ్రినే. కెరీర్ లో ముందుకు సాగే ఆమె జీవితాన్ని డబ్బు కోసం అల్లకల్లోలం చేశాడు. సినిమాలు ఆమెకు ఇష్టం లేకపోయినా .. కథ నచ్చినా నచ్చకపోయినా ఓకే చెప్పి డబ్బులు తీసుకొనేవాడట. ఇక ఆర్తీ డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణం ఆమె తండ్రే అని నిర్మాత చంటి అడ్డాల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

” ఆర్తీ చాలా యాక్టివ్. ఆమెతో కలిసి నేను రెండు సినిమాలు చేశాను. అడవి రాముడు, అల్లరి రాముడు. మొదట అల్లరి రాముడులో ఆర్తీ కి బదులు ఛార్మీని అనుకున్నాం. కానీ, చివరకు ఆర్తీనే సెట్ అయ్యింది. సెట్ లో ఎంతో హుషారుగా ఉందేది. కానీ, వాళ్ల నాన్న వస్తే మాత్రం చాలా సైలెంట్ అయిపోయేది. ఆమెను ఎంతో టార్చర్ పెట్టేవాడు. అతని వలనే ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది” అని చెప్పుకొచ్చాడు.

ఇక ఆ డిప్రెషన్ వలన కెరీర్ లో ముందుకు సాగలేకపోయింది. ఇక తండ్రి బలవంతం మీదనే పెళ్లి చేసుకున్న ఆమె.. భర్తతో కూడా పొసగక విడాకులు తీసుకుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వలన బరువు పెరిగిన ఆర్తీని.. బరువు తగ్గమని తండ్రి టార్చర్ పెట్టడంతో.. ఆమె సర్జరీ చేయించుకోవడానికి వెళ్లి.. అది ఫెయిల్ అయ్యి చనిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×