E-Paper
Advertisement

Actress Hema Angry: ఎక్కడకు రమ్మంటే అక్కడి వస్తా.. వాళ్లకు నటి హేమా సవాల్

Actress Hema Angry: ఎక్కడకు రమ్మంటే అక్కడి వస్తా.. వాళ్లకు నటి హేమా సవాల్
Advertisement

Actress Hema Angry: బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? రేవ్ పార్టీలో డ్రగ్స్‌ వినియోగంపై పోలీసులు ఛార్జ్‌షీట్ వేశారా? టాలీవుడ్ నటి హేమ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది? కొంతమంది కావాలనే ఆమెపై బురద జల్లుతున్నారా? హేమతోపాటు పట్టుబడినవారెక్కడ? హేమానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రేవ్ పార్టీ వెనుక అసలేం జరిగింది? జరుగుతోంది? ఇవే ప్రశ్నలు టాలీవుడ్ అభిమానులను వెంటాడుతున్నాయి.

బెంగుళూరు రేవ్ పార్టీలో ఏం జరిగిందో తెలీదు. పోలీసులు కోర్టుకు ఛార్జిషీటు సమర్పించినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దాదాపు 1100 పేజీలతో కూడిన ఛార్జ్‌షీటును అంద జేసినట్టు తెలిసింది. ఆ విషయం ప్రస్తుతం ఎంతవరకు వచ్చిందో తెలీదు. టాలీవుడ్ నటి హేమ మాత్రం కొన్ని యూట్యూబ్‌తోపాటు పలు ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాత వార్తను పదేపదే వండుతున్నారంటూ ఆందోళన వ్యక్తంచేసింది. తాజాగా ఆమె మరో వీడియోను విడుదల చేసింది.

Advertisement

పాత న్యూస్‌ని తీసుకొచ్చి పదేపదే ప్లే చేస్తున్నారంటూ వాపోయింది నటి హేమ. ఇప్పటివరకు తాను ఛార్జ్‌షీట్ చూడలేదని, అలాంటిది మీ చేతికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నించింది . తనపై పుకార్లు ఎందుకు రాస్తున్నారో తనకు అర్థం కావడంలేదని తెలిపింది. ఓ ఛానెల్ క్రైమ్ రిపోర్టర్‌ గతంలో తనపై ఇలాంటి చేశారని ఆరోపించింది.

రోజురోజుకూ తనపై వార్తలు రావడంతో తనదైన శైలిలో స్పందించింది హేమ. మీరు ఎక్కడికి తాను రమ్మంటే అక్కడికి వస్తానని తెలిపింది. డ్రగ్స్ టెస్టు చేయించాలని తనకు పాజిటివ్ వస్తే మీరు ఏ శిక్ష వేసినా అందుకు అంగీకరిస్తానని తెలిపింది.

Advertisement

ALSO READ: విష్ణుగారూ వినండి వీళ్ల గోడు.. టాలీవుడ్‌లోనూ మృగాలున్నాయ్, కమిటీ వేస్తారా?

ఒకవేళ అందులో నెగిటివ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించిదామె. ఇలాంటి వార్తల వల్ల మా అమ్మ మరింత అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. పరువు కోసం చనిపోయే వ్యక్తిని తాను అంటూ మనసులోని ఆవేదనను వ్యక్తం చేసింది. మరి నటి హేమ ఆవేదనతోనైనా ఆయా వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందా అనేది చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×