EPAPER

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Petrol vs Diesel vs Electric Cars: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. రోజు రోజుకు ప్రయాణ రేంజ్ పెంచుతూ అప్ డేట్ వెర్షన్ ఈవీలను ఆటోమోబైల్ సంస్థలు వినియోగదారులు ముందుకు తీసుకొస్తున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్లకు అధిక ధర ఉండటంతో కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారు. కానీ, పెట్రోల్, డీజిల్, కార్ల మెయింటెనెన్స్, ఫ్యూయల్ ఛార్జీలతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్, ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువ. పైగా ఎలక్ట్రిక్ కార్లకు ప్రభుత్వం బోలెడు సబ్సిడీలు  ఇస్తోంది. ఇంతకీ డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్ల ధరలు, మెయింటెనెన్స్, ఫ్యూయల్ ఖర్చులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను డీటైల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


పెట్రోల్, డీజిల్ vs ఎలక్ట్రిక్ కార్ల ధరలు

పెట్రోల్ కార్లతో పోల్చితే డీజిల్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్లు మరింత ఖరీదైనవి. టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఉదాహరణకు.. టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ మోడల్ కారును పరిశీలిస్తే, ఇందులో పెట్రోల్, డీజిల్, EV వేరియంట్లలో లభిస్తున్నాయి. పెట్రోల్ పెట్రోల్ బేస్ మోడల్ ధర రూ.7.79 లక్షలు(ఎక్స్-షోరూమ్)కాగా, ఆన్ రోడ్(ఢిల్లీ) ధర రూ.8.75 లక్షలుగా ఉంది. డీజిల్ బేస్ మోడల్ ధర రూ. 9.99 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, ఆన్-రోడ్(ఢిల్లీ) ధర రూ. 11.4 లక్షలు. ఇక ఈవీ మోడల్ విషయానికి వస్తే రూ. 14.49 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఆన్-రోడ్(ఢిల్లీ) ధర రూ. 15.25 లక్షల వరకు ఉంటుంది. సో, ఎలక్ట్రిక్ కారు ధర  పెట్రోల్ వేరియంట్ కంటే రూ. 6.50 లక్షలు, డీజిల్ వేరియంట్ కంటే దాదాపు రూ. 4 లక్షలు ఎక్కువ.


Also Read: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

పెట్రోల్, డీజిల్ vs ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చులు

ఎలక్ట్రిక్ కార్లతో పోల్చితే, పెట్రోల్, డీజిల్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజీల్ కార్ల ఇంజిన్లు, ఉద్గారాల నియంత్రణ వ్యవస్థ నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లులో తక్కువ కదిలే భాగాలు ఉంటాయి. పెట్రో, డీజిల్ కార్లతో పోల్చితే మెయింటెనెన్స్, సర్వీసింగ్, ఆయిల్ ఛేంజ్ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి.

పెట్రోల్, డీజిల్ vs ఎలక్ట్రిక్ కార్లకు ప్రభుత్వ సబ్సిడీలు

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పెద్ద మొత్తంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఎలక్ట్రిక్ కార్లు తక్కువ GST రేట్లు, ట్యాక్స్ బెనిఫిట్స్, కొనుగోలు సబ్సిడీలను అందిస్తున్నది.

పెట్రోల్, డీజిల్ vs ఎలక్ట్రిక్ కార్ల  మైలేజ్, ఇంధన ఖర్చులు

పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డీజిల్ ఇంజిన్ తో పోల్చితే పెట్రోల్ ఇంజిన్ తక్కువ మైలేజీని అందిస్తుంది. పెట్రోల్ కార్లు నడపడానికి అత్యంత ఖరీదైనవి.  డీజిల్ ధరలు పెట్రోల్ కంటే తక్కువగా ఉంటాయి.  డీజిల్ కార్లు మంచి మైలేజీని కూడా అందిస్తాయి. పెట్రోల్ కారు ఇంధన ఖర్చులతో పోల్చితే డీజిల్ ఇంధన ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఈ రెండు కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ ఖర్చు అత్యంత తక్కువ కావడం విశేషం.

ఉదాహరణకు.. టాటా Nexon మూడు వేరియంట్లను పరిశీలిస్తే.. బేసిక్ వేరియంట్ మాన్యువల్ అవతార్‌ లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 17.33 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ లీటరుకు 23.22 కి.మీ మైలేజీని ఇస్తుంది. నెక్సాన్ EV ప్రైమ్ ఫుల్ ఛార్జ్ తో 312 కి. మీ రేంజ్ ని అందిస్తుంది. ఒకరు రోజుకు 50 కి.మీ ప్రయాణిస్తే నెలకు 1,500 కి.మీ డాదికి 18,000 కిలో మీటర్లు ప్రయాణిస్తాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97 ఉన్నది. లీటరుకు 17.33 కిమీ మైలేజీ లభిస్తుంది. కి. మీ రూ. 5.6 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి ఇంధన ఖర్చులు రూ. 1,00,800 అవుతుంది. ఢిల్లీలో డీజిల్ ధర రూ. 90. డీజిల్ కారు లీటరుకు 23.22 కి. మీ మైలేజీ అందిస్తుంది.  ఒక కి.మీకి రూ.3.9 అవుతుంది. అంటే ఏడాదికి ఫ్యూయెల్ ఖర్చు రూ.70,200 అవుతుంది. ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి 30.2 కిలో-వాట్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు రూ. 250 ఖర్చు అవుతుంది. అంటే కి. మీకి సుమారు 80 పైసలు ఖర్చు అవుతుంది. EV ఛార్జ్ చేయడానికి ఏడాదికి కేవలం రూ.14,400 ఖర్చు అవుతుంది. (వినియోగదారుడు ప్రయాణించే దూరం బట్టి ఇది ఆధారపడి ఉంటుంది)

మొత్తంగా ఎలక్ట్రిక్ కారు యజమాని పెట్రోల్ కారుతో పోల్చితే రూ. 86, 400, డీజిల్ కారుతో పోల్చితే రూ. 55.800 ఆదా చేసే అవకాశం ఉంటుంది.

Related News

Vande Bharat Sleeper: వందే భారత్ లో కాశ్మీర్ వెళ్లిపోవచ్చు, ఎప్పటి నుంచో తెలుసా?

Indian Railways: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

Big Stories

×