E-Paper
Advertisement

Casting Couch In Tollywood: విష్ణుగారూ వినండి వీళ్ల గోడు.. టాలీవుడ్‌లోనూ మృగాలున్నాయ్, కమిటీ వేస్తారా?

Casting Couch In Tollywood: విష్ణుగారూ వినండి వీళ్ల గోడు.. టాలీవుడ్‌లోనూ మృగాలున్నాయ్, కమిటీ వేస్తారా?
Advertisement

Sexual Assault Charges on Jani Master Can Tollywood Form a Panel to Counter the Casting Couch: టాలీవుడ్ లో మరోసారి కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గుప్పుమంటుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేసారు. దీంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసారు పోలీసులు. ప్రస్తుతం జానీ మాస్టర్ అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు.

ఇదిలావుంటే.. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవకాశాల ముసుగులో మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేసినట్లుతెలుస్తోంది. ఇటీవల ఓ సినిమాకు కొరియోగ్రాఫర్ గా ఆ మహిళకు అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల అదే సినిమాకు సంబంధించి జానీ మాస్టర్ కు అవకాశం ఇచ్చింది ఆ చిత్ర యూనిట్.. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్ లో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతోంది. చెన్నై, ముంబై లలో ఔట్ డోర్ షూటింగ్స్ లతో పాటు.. హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటి లో సైతం.. జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు చెబుతున్నారు.

ఇక.. జానీ మాస్టర్ పై కేసుతో మరోసారి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం తెరపైకొచ్చింది. గతంలోనూ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టించింది. చిత్రసీమకు సంబంధించిన మహిళా నటులకు భద్రత కల్పించాలంటూ మహిళా సంఘాలు సైతం ఆందోళనకు దిగాయి. కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి అప్పట్లో నానా రచ్చ జరిగింది. టాలీవుడ్ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై సబ్ కమిటీ వేయాలని అప్పట్లోనే సర్వత్రా డిమాండ్ విన్పించింది. కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. తాజాగా జానీ మాస్టర్ వ్యవహారంతో కాస్టింగ్ కౌచ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read: ఎక్కడ పడితే అక్కడ, ఆఖరికి ఇంట్లో కూడా.. జానీ మాస్టర్‌‌ కేసులో సంచలన నిజాలు

ఇటీవల కేరళలో మహిళలకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. దీంతో ఇక్కడ కూడా అలాంటి కమిటీ వేయాలన్న డిమాండ్ విన్పిస్తోంది. అందులో భాగంగానే .. టాలీవుడ్ లో మహిళల భద్రతకు సంబంధించి కమిటీ వేయాలని ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ట్వీట్ చేసారు.

చిత్రసీమకు సంబంధించి అవకాశాల ముసుగులో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు అలాగే ఈ ముసుగులో మగ్గిపోతున్నారు. కాగా.. మహిళలను వేధించే దుర్మార్గుల అంతు చూడాలంటే కచ్చితంగా జస్టిస్ హేమ కమిటీ తరహాలో సబ్ కమిటీ వేయాలన్న డిమాండ్ ఇప్పుడు సర్వత్రా విన్పిస్తోంది. కాగా ఈ ఘటనపై సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×