BigTV English
Advertisement

Hero Ajith: అల్ట్రా స్టైలిష్ లుక్ లో స్టార్ హీరో.. ఏమున్నాడ్రా బాబు..

Hero Ajith: అల్ట్రా స్టైలిష్ లుక్ లో స్టార్ హీరో.. ఏమున్నాడ్రా బాబు..

Hero Ajith : తమిళ స్టార్ హీరో అజిత్ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కూడా అజిత్ సినిమాలు చాలానే వచ్చాయి. తమిళ్లో చేసిన సినిమాలు తెలుగులో డబ్ అవ్వడంతో తెలుగులో హీరో గారికి మంచి మార్కెట్ ఉంది. మొదటి నుంచి మాస్ యాక్షన్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అజిత్ కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడన్న విషయం తెలిసిందే.. మాస్, యాక్షన్ స్టోరీలను ఎంపిక చేసుకొని బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరుగా ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా అజిత్ అల్ట్రా స్టైలిష్ లుక్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


స్టైలిష్‌ గా ఛీర్‌ అప్‌ మూడ్‌ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బ్యాక్‌ డ్రాప్‌ లో గన్స్‌ రౌండప్ చేసిన ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా సెట్స్ నుంచి దర్శకుడు అధిర్, హీరో అజిత్ వర్కింగ్ స్టిల్ ను షేర్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ షూటింగ్ స్పెయిన్ లోని మాడ్రిడ్ లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ షేర్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో అజిత్ హ్యాండ్సమ్ లుక్ లో అదిరిపోయాడు. వైట్‌ అండ్ వైట్ సూట్‌ లో స్టైలిష్‌ గాగుల్స్‌ తో ఛిల్‌ అవుట్‌ మూడ్‌ లో ఉన్న అజిత్ పిక్.. ఓ రేంజ్ లో ఇప్పుడు రెస్పాన్స్ అందుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అజిత్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశారని అంటున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ కామెంట్లు పెడుతున్నారు..

ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా విషయానికొస్తే.. తెలుగులో టాప్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. తెలుగు యాక్టర్ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వీరమ్ మూవీ తర్వాత అజిత్, డీఎస్పీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్ అండ్ వర్కింగ్ స్టిల్ చూస్తుంటే.. సినిమాలో అజిత్ యాక్షన్ లుక్ లో అజిత్ కనిపిస్తారని తెలుస్తుంది. రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది.. ఇక మిజిల్ తిరుమేని దర్శకత్వంలో విదామూయార్చి సినిమా కూడా అజిత్ చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఆ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ మూవీ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకోకున్నాడని టాక్.. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×