BigTV English

Sardar 2: షూటింగ్ సెట్స్‌లో హీరోగా గాయాలు….. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు..!

Sardar 2: షూటింగ్ సెట్స్‌లో హీరోగా గాయాలు….. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు..!

Sardar 2.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ (Karthik) సర్దార్ (Sardar ) సినిమా సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ‘సర్దార్ 2’ పేరిట రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్ లో శరవేగంగా జరుపుకుంటుంది. అయితే షూటింగ్ మైసూర్‌లో చేస్తున్న టైంలో హీరో కార్తిక్ కాలికి గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన చిత్ర బృందం ఆయనను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు సుమారుగా 2 వారాల పాటూ విశ్రాంతి తీసుకోవాలని తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా తమ అభిమాన హీరో కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ చిత్రాన్ని పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా నిర్మిస్తున్నారు.


సర్దార్ 2 తారాగణం..

ఈ సినిమాలో కార్తీ, ఎస్.జె. సూర్య , మాళవిక మోహనన్ , ఆషికా రంగనాథ్ తోపాటూ రజీషా విజయన్‌ లు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత ఏడాది జూలైలో చెన్నైలో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తూ ఉండగా..విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. ఇక ఇందులో కూడా కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.


హీరో కార్తీ కెరియర్..

తమిళ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న కార్తీ తెలుగులో కూడా తన చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఈయన మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, ఆ తర్వాత 2007లో వచ్చిన పరుత్తివీరన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తర్వాత పలు చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కార్తీ.. 1977 మే 25వ తేదీన తమిళనాడులో జన్మించారు. ఇకపోతే తమిళంలో ఈయన నటించి.. డబ్బింగ్ చేసిన తెలుగు చిత్రాల విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, ఆవారా, శకుని, కాష్మోరా, చెలియా, దొంగ, ఖాకీ, ఖైదీ, సుల్తాన్ వంటి చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి హీరో కార్తీ కి మంచి ఇమేజ్ను అందించాయి. ఇక ఇప్పుడు సర్దార్ సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయనకు సడన్గా గాయాలవ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్తీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2011లో రజిని చిన్నస్వామిను వివాహం చేసుకోగా.. ఒక బిడ్డకు జన్మనిచ్చారు . ఇక కార్తీ ఎవరో కాదు శివకుమార్ వారసుడే . ఈయన అన్నయ్య సూర్య కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉండగా.. వదిన జ్యోతిక కూడా స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది . త్వరలోనే ఈమె కూడా ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీకి బృందా అనే ఒక చెల్లెలు కూడా ఉంది.ఇకపోతే హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాల సీక్వెల్స్ తో బిజీగా మారబోతున్నారు. సర్దార్ 2 తర్వాత మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టిన ఈయన.. త్వరలోనే ఆ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించబోతున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×