BigTV English

Elon Musk Loses: నెలరోజుల్లోనే దాదాపు 8 లక్షల కోట్లు కోల్పోయిన ఎలాన్ మస్క్.. ఏమైందంటే..

Elon Musk Loses: నెలరోజుల్లోనే దాదాపు 8 లక్షల కోట్లు కోల్పోయిన ఎలాన్ మస్క్.. ఏమైందంటే..

Elon Musk Loses: ఇటీవల మార్కెట్లోకి వచ్చిన చైనాకు చెందిన AI కంపెనీ డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇది మార్కెట్లోకి వచ్చిన క్రమంలో అడ్వాన్స్ ఫీచర్ల విషయంలో సక్సెస్ అయినట్లు టాక్ వచ్చింది. దీంతో అనేక మంది దీనిని వినియోగించడం మొదలుపెట్టారు. అదే సమయంలో డీప్‌సీక్ అడ్వాన్స్ ఏఐ మోడల్ ను కూడా ఫ్రీగా అందిస్తున్న క్రమంలో దీనికి డిమాండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో అనేక ఏఐ కంపెనీల స్టాక్స్ అమెరికా స్టాక్ మార్కెట్లో అమ్మకాలు చేశారు. దీంతో ఆయా సంస్థల ఆదాయాలు బారీగా తగ్గిపోయాయి. ఇదే సమయంలో టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎలాన్ మస్క్ ఆదాయం ఏకంగా 90 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.8 లక్షల కోట్లు) కోల్పోయారు.


ఇతర బిలియనీర్లు కూడా..

దీంతోపాటు ఎన్విడియా CEO జెన్సెన్ హువాంగ్ 20 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.7 లక్షల కోట్లు), మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ 11 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 960 బిలియన్లు) నష్టపోయారు. డీప్‌సీక్ వేగవంతమైన వృద్ధి.. ప్రపంచ టెక్ దిగ్గజాలు, బిలియనీర్లను షేక్ చేసిందని చెప్పవచ్చు. జనవరిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్ల సమిష్టి సంపద 314 బిలియన్ డాలర్లు పెరిగింది. కానీ ఈ AI స్టార్టప్‌ భారీ విజయం కారణంగా వారి సంపద భారీగా తగ్గింది. డీప్‌సీక్ విజయం కారణంగా వారి నికర విలువ ఫిబ్రవరి ప్రారంభంలో US$433 బిలియన్ల నుంచి నెలాఖరు నాటికి US$349 బిలియన్లకు పడిపోయింది.

Read Also: Portable Air Cooler: రూ. 500కే అదిరిపోయే పోర్టబుల్ కూలర్.. దీని స్పెషల్ ఏంటంటే..


నష్టపోయినా కూడా..

కేవలం ఒక నెల రోజుల్లోనే ఫిబ్రవరిలో ఆర్థిక అస్థిరత తీవ్ర మాంద్యంలోకి దూసుకెళ్లింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులు పలువురు భారీ నష్టాలను చవిచూశారు. నష్టాలు ఉన్నప్పటికీ NVIDIA CEO కంపెనీ ఆదాయాల సమావేశంలో ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని మెచ్చుకున్నారు. ఇది ప్రపంచ స్థాయి తార్కిక AI మోడల్‌ను ఓపెన్ సోర్స్ చేసిందని హువాంగ్ అన్నారు. ఈ క్రమంలో డీప్‌సీక్ ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తించిందని ఆయన పేర్కొన్నారు.

కీలక సంస్థల ఆదాయం..

డీప్‌సీక్ విజయం కారణంగా మరికొందరు బిలియనీర్ల సంపద కూడా పడిపోయింది. వారిలో ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ US$27.6 బిలియన్లను కోల్పోయారు. దీంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత ధనవంతుడి నుంచి ఐదో స్థానానికి చేరుకోవడం విశేషం. ఎందుకంటే ఆయన కంపెనీ షేర్లు 14% తగ్గాయి. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర విలువ 6.3 బిలియన్ డాలర్లు తగ్గింది. డెల్ CEO మైఖేల్ డెల్ $12.4 బిలియన్లను నష్టపోయారు. డీప్‌సీక్ వేగవంతమైన పెరుగుదల AI స్టాక్‌లలో భారీ అమ్మకాలకు దారితీసింది. ఇది సిలికాన్ వ్యాలీలోని అత్యంత సంపన్న వ్యక్తుల ఆదాయాన్ని భారీగా తగ్గించింది.

ఓపెన్ ఏఐ పోటీ ఇస్తుందా..

మరోవైపు OpenAI అభివృద్ధి చేసిన ChatGPT కొత్త సంభాషణ AI కూడా విప్లవాత్మకంగా ఉందని చెబుతున్నారు. ఇది కస్టమర్ సేవ, కంటెంట్ సృష్టి, విద్య వంటి సేవలకు విస్తృతంగా ప్రజాదరణ పొందిందని అంటున్నారు. ఈ క్రమంలో డీప్‌సీక్ అంతర్జాతీయంగా విస్తరిస్తుండగా, ChatGPT ఇప్పటికే భారీగా వినియోగదారులను సంపాదించుకుంది. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల వంటి ప్రధాన ప్లాట్‌ఫామ్‌లలో మద్దతుతో దీని ప్రభావం కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×