BigTV English

Krishnudu : ఆ స్టార్ హీరో కారుకు డాష్ ఇచ్చిన కృష్ణుడు.. ఆ హీరో ఏమన్నాడంటే..?

Krishnudu : ఆ స్టార్ హీరో కారుకు డాష్ ఇచ్చిన కృష్ణుడు.. ఆ హీరో ఏమన్నాడంటే..?

Krishnudu : సినీ ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ ఎంతవరకు ఉంటుందో చెప్పడం కష్టం.. కొంతమంది నటులు రెండు మూడు చిత్రాలతోనే భారీ పాపులారిటీ సంపాదించుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచీ కనుమరుగవుతూ ఉంటారు. ఇంకొంతమంది కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారు. అప్పుడు కూడా సక్సెస్ అందుకొని వారు ఇండస్ట్రీకి కంప్లీట్ గా గుడ్ బై చెప్పేస్తారు. కొందరు రీ ఎంట్రీ తర్వాత సక్సెస్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతారు. ఇప్పుడు మరో హీరో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు హీరో, కమెడీయన్ కృష్ణుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇటీవల పాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు.


కృష్ణుడు లైఫ్ లో ఫన్నీ యాక్సిడెంట్.. 

కృష్ణుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమంత్ యాంకర్ గా వ్యవహరించగా.. అందులో కృష్ణుడు తన లైఫ్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ గురించి చెప్పాడు.. ఆ విషయాన్ని ఎప్పటికి మర్చిపోలేనేనని చెప్పాడు. బైక్ పై వెళ్తూ ఎవరిదో స్పోర్ట్స్ కారు ఆగి ఉందని అలా చూసుకుంటూ వస్తుంటే గుద్దేశాను.. దాని ఖరీదు మూడు కోట్లు వరకు ఉంటుంది. ఎవరైనా అయితే అస్సలు ఒప్పుకోరు కానీ నాగార్జున మాత్రం చూసుకోలేదు అన్నావు కదా వెళ్ళు అన్నారు. ఇదే నేను మర్చిపోలేను అని కృష్ణుడు చెప్పాడు.. ఆ కృష్ణుడు ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గతంలో భారీ శరీరంతో ఉన్న ఆయన తగ్గినట్లు కూడా తెలుస్తుంది


ఇక ఈయన సినీ కే్రీర్ విషయానికొస్తే.. గంగోత్రి చిత్రంతో కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత చాలా చిత్రాలలో నటించి ప్రేక్షకుల ను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హ్యాపీడేస్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాలు ఈయనకు బాగా కలిసి వచ్చాయి. ఇకపోతే ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్న ఈయన ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ కృష్ణుడు ఇండస్ట్రీకి ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అందుకే కారణం ఎంతనేది వివరించాడు.. ఈయన ఏ సినిమాలో చేసినా వినాయకుడు అని మాత్రమే పిలుస్తున్నారు. అసలు ఛాలెంజింగ్ రోల్స్ ఏవి నా వద్దకు రావట్లేదు. రొటీన్ గా ఒకే తరహా పాత్రలు చేసి విసుగు వచ్చింది. దీనికి తోడు ఫోటోగ్రఫీ కి వెళ్తే అక్కడ కూడా పెద్దగా ఏవీ నాకు ఇంట్రెస్ట్ కలిగించే అంశాలు కనిపించలేదు.. అందుకే దూరం అయ్యాను అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వరుస ఆఫర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు.  ఎంట్రీ తోనే భారీ బడ్జెట్ సినిమా లో ఛాన్స్ అందుకోవడం మాములు విషయం.. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడని తెలుస్తుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×