BigTV English

Bigg Boss 8 Telugu: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతో పాటు మరొక కంటెస్టెంట్ ఔట్

Bigg Boss 8 Telugu: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతో పాటు మరొక కంటెస్టెంట్ ఔట్

Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటివరకు ఒక్కటే డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇక ఇప్పుడు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ సంఖ్య చూస్తుంటే మరొక డబుల్ ఎలిమినేషన్ పక్కా అని ప్రేక్షకులు ఎప్పుడో అంచనా వేశారు. ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే గంగవ్వ.. పలు అనారోగ్య కారణాలతో హౌస్ వదిలి వెళ్లిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శనివారం గంగవ్వ బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిపోతే.. ఆదివారం ఎప్పటిలాగానే ఒక ఎలిమినేషన్ జరగనుంది. అలా గంగవ్వతో పాటు డబుల్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లేది మరెవరో కాదు.. హరితేజ.


ఎన్నో మార్పులు

బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా వచ్చింది హరితేజ. అప్పటివరకు తను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియల్స్‌లో నటిగా అలరించినా కూడా బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాతే హరితేజ రేంజ్ మారిపోయింది. తను ఆ సీజన్‌లో అందించిన ఎంటర్‌టైన్మెంట్‌ను ప్రేక్షకులు ఇప్పటివరకు మర్చిపోలేరు. అలాగే తను బిగ్ బాస్ 1లో చెప్పిన హరికథ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి హరితేజ.. బిగ్ బాస్ 8లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటికి, ఇప్పటికి తనలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రేక్షకులకు నచ్చక తనను బయటికి పంపించేశారు. ఇక బిగ్ బాస్ 8ను ఏలేద్దామని వచ్చిన హరితేజ మధ్యలోనే వెళ్లిపోక తప్పడం లేదు.


Also Read: హౌస్ నుండి గంగవ్వ ఎలిమినేట్.? మరోసారి అదే కారణం..

రంగులు మార్చింది

బిగ్ బాస్ 1లో హరితేజ అంటే ఒక ఎంటర్‌టైనర్.. కానీ బిగ్ బాస్ 8లో అలా కాదు.. గెలుపు కోసం ఎంతకైనా తెగించి.. స్వార్థంలో నిండిపోయిన మనస్థత్వంతో ఈ సీజన్‌లోకి ఎంటర్ అయ్యింది హరితేజ. అందుకే తను ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. పైగా గత రెండు వారాలు నుండి ఇతర కంటెస్టెంట్స్‌తో హరితేజకు గొడవలు ఎక్కువయ్యాయి. అలా కూడా తనపై నెగిటివిటీ పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం కొన్ని ఫ్రెండ్‌షిప్ టీమ్స్ ఉన్నాయి. హరితేజ వచ్చినప్పటి నుండి అసలు తను ఏ టీమ్ అనేది క్లారిటీ లేకుండా పోయింది. సమయానుసారం కొత్త కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ.. అవసరం ఉన్నప్పుడు పాత కంటెస్టెంట్స్‌తో క్లోజ్‌గా ఉంటూ రంగులు మార్చింది హరితేజ.

ఆ గొడవే మైనస్

బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టినప్పటి నుండి ప్రేరణకు, హరితేజకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. చిన్న విషయాలను పెద్దగా చేసి చూస్తూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. పైగా గత మూడు వారాల నుండి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ ఇష్టం వచ్చిన మాటలు అనుకుంటున్నారు. అది కూడా హరితేజ ఎలిమినేషన్‌కు కారణమయ్యింది. ఈమధ్యకాలంలో ప్రేరణకు సపోర్ట్ విపరీతంగా పెరిగిపోయింది. తనతో గొడవలు పెంచుకోవడం అనేది హరితేజకు మైనస్‌గా మారింది. ప్రేరణ సపోర్టర్స్ అంతా హరితేజ గెలవకూడదనే ఉద్దేశ్యంతో నామినేషన్స్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేస్తూ వారిని గెలిపించారు. ఫైనల్‌గా హరితేజను ఎలిమినేట్ చేశారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×