BigTV English

YCP Activist : బోరుగడ్డ విషయంలో వాళ్లు చెప్పినట్లే చేస్తున్నాం.. మా తప్పు లేదంటున్న పోలీసులు

YCP Activist : బోరుగడ్డ విషయంలో వాళ్లు చెప్పినట్లే చేస్తున్నాం.. మా తప్పు లేదంటున్న పోలీసులు

Borugadda Anil : రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్.. బోరుగడ్డ అనిల్ కు బిర్యానీతో మర్యాద చేసి పోలీసులు చిక్కుల్లో పడిన విషయం తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులకు రానురాను మరిన్ని తలనొప్పులు తప్పేలా లేవు. ఇలాంటి తరుణంలో బోరుగడ్డ అనిల్ కు మర్యాదలు చేస్తున్నట్లు ఉన్న మరో వీడియో లీకైంది. స్టేషన్లో బోరుగడ్డకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఉన్న ఆ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


రిమాండ్ ఖైదీ, రౌడి షీటర్ అయిన బోరుగడ్డ అనిల్ కు ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు.? ప్రత్యేక సౌకర్యాలు ఎందుకు కల్పిస్తున్నారు.? అంటూ అటు కూటమి నేతలు, ఇటు సోషల్ మీడియా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో.. గుంటూరు ఎస్పీ సతీష్ మీడియాతో ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. బోరుగడ్డ వ్యవహారంలో ప్రస్తుత ఘటనలపై వివరణ ఇచ్చిన ఆయన.. తమవైపు నుంచి ఎలాంటి పొరబాట్లు లేవని వెల్లడించారు.

బోరుగడ్డకు ఎలాంటి రాచమర్యాదలు చేయలేదని స్పష్టతనిచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్.. రెస్టారెంట్లో భోజనం విషయంలో మాత్రం పోలీసుల పొరపాటు ఉందని అంగీకరించారు. రిమాండ్ ఖైదీని నిందితుడి అనుచరులు అనుసరించారని, రెస్టారెంట్ కు వెళ్లిన తర్వాత బోరుగడ్డ అనిల్ అనుచరులే డబ్బులు చెల్లించారని తెలిపారు. ఆ ఘటనలో తప్పును గుర్తిస్తున్నామన్న ఎస్పీ సతీష్.. అందుకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కేవలం ఈ ఒక్క సంఘటనలోనే ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశామని, వారంలో మరింత లోతుగా విచారణను పూర్తి చేస్తామని ప్రకటించారు. అందులోని అంశాల ఆధారంగా.. తదుపరి చర్యలపై ఆలోచిస్తామని ప్రకటించారు.


ఆ విషయం మరువక ముందే.. పోలీస్ కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు అంటూ మరో వీడియో వైరల్ అయ్యింది. అందులో.. బోరుగడ్డ రాత్రి వేళ పడుకునేందుకు ఓ పరుపు, దుప్పటి ఇచ్చిన పోలీసులు.. కొంచెం సేపటి తర్వాత దిండును సైతం అందించారు. దీనికి సంబంధించిన ఓ సీసీ కెమెరా వీడియో లీకవడంతో.. మొత్తం భండారం బయటపడింది. దాంతో.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రభుత్వ పెద్దలు ఎన్ని చివాట్లు పెట్టినా, కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్ లో బోరుగడ్డకు రాచమర్యాదలు తగ్గడం లేదంటూ పోలీసులపై విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో.. వివరణ ఇచ్చేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read : మీవల్లే పవన్ కళ్యాణ్ పిల్లలు బోరున ఏడ్చారు.. మీ సంగతి చూస్తా.. దడపుట్టించే వార్నింగ్

బోరుగడ్డ అనిల్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చే ముందే కోర్టు 14 షరతులు విధించిందని తెలిపారు. నిందితుడికి.. మంచి నీళ్లు, భోజనం, నిద్రపోయేందుకు వసతి వంటి వాటిని అందించాలని సూచించిందని వెల్లడించారు. అలాగే.. కస్టడీ కంటే ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో.. బోరుగడ్డకు కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడైందని ఆ కారణంగానే.. కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి వచ్చిందని అన్నారు.
వైద్యుల నివేదికల ప్రకారం.. బోరుగడ్డకు గ్యాస్ సమస్య ఉందన్న గుంటూరు జిల్లా ఎస్పీ.. పోలీస్ కస్టడీలో ఏమైనా జరిగినా తామే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దని సూచించారు. అందుకే.. అతని ఆరోగ్య పరిస్థితుల కారణంగా.. కాస్త జాగ్రత్తగా చూసుకుని ఉంటారని, గ్యాస్ కారణంగా దిండు అందించినట్లు భావిస్తునట్లు వెల్లడించారు.

ఆ వీడియో భయటకు రావడం తప్పు..

లీకైన వీడియోలోని అంశాలపై తనకు పెద్దగా అభ్యంతరాలు లేవన్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.. దానిని రాచమర్యాదలుగా చూపించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో అసలు.. పోలీస్ స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీ టీవీ వీడియో ఎలా బయటకు వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. ముందుగా ఈ విషయం పైనే విచారణ జరుపుతామని వెల్లడించారు. పోలీసు స్టేషన్ లోని వీడియోను ఎలా లీక్ చేస్తారన్న ఎస్పీ సతీష్.. అది చాలా పెద్ద పొరబాటు అని వ్యాఖ్యానించారు. అలా స్టేషన్ వ్యవహారాలు బయటకు తెలియకూడదని, అలా వీడియోను రిలీజ్ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టామన్న ఎస్పీ సతీష్ కుమార్.. బాధ్యులపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×