E-Paper
Advertisement

Hero Madhavan’s son’s records:-హీరో మాధవన్ కుమారుడి రికార్డులు.. స్విమ్మింగ్‌లో 5 గోల్డ్ మెడల్స్ 

Hero Madhavan’s son’s records:-హీరో మాధవన్ కుమారుడి రికార్డులు.. స్విమ్మింగ్‌లో 5 గోల్డ్ మెడల్స్ 
Advertisement

Hero Madhavan’s son’s records:- హీరోలు.. తమ వారసుడిగా సినిమాల్లోకే తీసుకురావాలనుకుంటారు. వాళ్ల ఇష్టప్రకారం చేయమని చెప్పే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు మాధవన్ కూడా ఒకడు. ఈ హీరో కుమారుడు స్విమ్మింగ్‌లో సూపర్ టాలెంటెడ్. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడలే ధ్యేయంగా వర్కౌట్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్‌పై ఇంట్రస్ట్ ఉండడంతో అటువైపే ప్రోత్సహించారు. ఇష్టం, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండడంతో మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ కూడా మంచి పర్ఫామెన్స్ చూపిస్తున్నాడు.

సాదాసీదాగా కాదు.. చిన్న వయసులోనే స్విమ్మింగ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు వేదాంత్. రీసెంట్ గా మలేషియాలో జరిగిన స్విమ్మింగ్‌ పోటీల్లో ఏకంగా 5 స్వర్ణాలు సాధించాడు. మలేషియన్‌ ఇన్విటేషనల్‌ ఏజ్‌ గ్రూప్‌ ఛాంపియన్‌షిప్స్‌‌లో పాల్గొన్న వేదాంత్.. ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌‌లో పార్టిసిపేట్ చేశాడు. 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లలో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు. కుమారుడి గెలుపుతో మాధవన్‌ సంతోషంలో మునిగిపోయాడు.

Advertisement

దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో వేదాంత్‌ గెలిచాడు అంటూ మాధవన్ ట్వీట్ చేశాడు. భారత్‌కు 5 స్వర్ణాలు అందించిన వేదాంత్‌ను చూస్తుంటే గర్వంగా, సంతోషంగా ఉందని మెసేజ్ పెట్టాడు.

వేదాంత్‌ గతంలోనూ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. లాస్ట్ ఫిబ్రవరిలో మహారాష్ట్ర తరఫున ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ లో పాల్గొని 5 స్వర్ణాలు, 2 రజతాలు సాధించాడు. గతేడాది జులైలో వేదాంత్‌ 48వ జూనియర్‌ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో 1500 మీటర్ల ఫ్రీ స్టైల్‌ స్విమ్మింగ్‌లో గెలిచి జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ రికార్డును బద్దలుకొట్టాడు. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×