BigTV English

Dhruv Jurel:-పర్ఫెక్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇతనిలా ఉండాలి… ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో.

Dhruv Jurel:-పర్ఫెక్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇతనిలా ఉండాలి… ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో.

Dhruv Jurel:- ధ్రువ్ జురెల్.. చెప్పుకోడానికి పెద్దగా రికార్డ్స్ ఏమీ లేవు. కాని, ఈ ప్లేయర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలనుకునే వారికి ఇతడిలో చాలా విషయాలు ఉన్నాయి. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన ధ్రువ్ జురెల్.. క్రికెటర్‌గా మరడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసుకోవాల్సిందే. ఓ ఇంటర్వ్యూలో క్రికెట్లో అడుగుపెట్టడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు.


జస్ట్ 20 లక్షలు పెట్టి ధ్రువ్ జురెల్ ను తీసుకుంది రాజస్తాన్ రాయల్స్. వికెట్ కీపర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన ధ్రువ్ జురెల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. సరైన ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు. అలాగని సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేస్తున్నాడని కాదు.. జట్టుకు కీలక సమయంలో కీలకమైన రన్స్ అందిస్తున్నాడు. వికెట్లు పడిపోకుండా అడ్డుకుంటూ.. మరో ఎండ్ లో ధాటిగా ఆడుతున్న బ్యాట్స్ మన్‌కు అండగా నిలబడుతున్నాడు. అది చాలదా చెప్పండి.

ధ్రువ్ జురెల్ ను బెస్ట్ ఫినిషర్ అనొచ్చేమో. ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో ధాటిగా ఆడడం ఈ ప్లేయర్ ప్రత్యేకత. పంజాబ్ కింగ్స్‌పై ధ్రువ్ జురెల్ కేవలం 15 బంతుల్లో 32 ర‌న్స్ చేశాడు. గుజ‌రాత్ టైట‌న్స్‌పై జురెల్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 ర‌న్స్ కొట్టాడు.


ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ తరపున డొమెస్టక్ క్రికెట్లో ఆడుతున్న ధ్రువ్ జురెల్.. 12 ఏళ్ల వయసులో ఓ క్యాంప్‌లో మహేంద్ర సింగ్ ధోనీని చూశాడు. అప్పటి నుంచి క్రికెట్ ను సీరియస్ గా తీసుకున్నాడు. ధ్రువ్ జురెల్ తండ్రి ఆర్మీలో చేశారు. తనకు కూడా ఆర్మీలోకి వెళ్లాలనేది ఆశ. అయితే, తండ్రికి మాత్రం ఓ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలనుకున్నాడు. కాని విధి మరొకటి తలచింది.

చిన్న వయసులోనే క్రికెట్లో రాణిస్తున్నా పేదరికం అడ్డొచ్చేది. కనీసం గ్లోవ్స్ కొనేందుకు కూడా డబ్బులు ఉండేవి కావు. దీంతో ధ్రువ్ జురెల్  తల్లి తన బంగారం అమ్మి గ్లోవ్స్, కిట్స్ కొనిచ్చారని చెప్పుకొచ్చాడు. గ్లోవ్ చినిగిపోతే.. స్వయంగా తన తండ్రే కుట్టేవాడని చెప్పాడు. కుటుంబ పరంగా దయనీయ స్థితిలో ఉన్న తాను.. క్రికెట్లో ఈ స్థాయికి వస్తానని ఏనాడు అనుకోలేదట. క్రికెట్ పై ఉన్న ప్యాషన్‌తో బాగా కష్టపడ్డాడు. సెలక్టర్ల కంట్లో పడి దేశవాలీ క్రికెట్లో అడుగుపెట్టాడు. అక్కడ బాగా రాణిస్తుండడంతో.. ఇప్పుడు ఫస్ట్ టైం ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్లేయర్ గా ఇంకాస్త ఇంపాక్ట్ చూపిస్తే.. రేప్పొద్దున టీమిండియా జట్టులోకి కూడా రావొచ్చేమో. ఆల్ ద బెస్ట్ ధ్రువ్ జురెల్. 

Related News

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్… బీసీసీఐ సంచలన నిర్ణయం.. బాయ్ కాట్ చేస్తూ

Shahidi Afridi : ఫైనల్స్ లో షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడం పక్కా… రాసి పెట్టుకోండి.. ఇండియాకు నిద్ర లేకుండా చేస్తాం

Shoaib Akhtar : అభిషేక్ శర్మ మనిషి కాదు… వాడో జంతువు.. పాకిస్తాన్ తట్టుకోవడం కష్టమే

Asia Cup 2025 : పాకిస్తానీల అరాచకాలు.. గ్రౌండ్ లోనే లేడీ అభిమాని ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు!

IND Vs PAK : ఫైనల్స్ లో పాకిస్థాన్ ప్లేయర్స్ కు యానిమల్ మూవీ చూపించడం పక్కా..?

India vs Pakistan, Final: పాకిస్థాన్ కు ఘోర అవ‌మానం..ఫోటో షూట్ కు సూర్య డుమ్మా…వేయిట్ చేస్తున్న స‌ల్మాన్ ?

Harshit Rana – Gambhir : టీమిండియాకు అస‌లు విల‌న్‌ హర్షిత్ రాణానే..గంభీర్ వ‌ల్లే ఈ చెత్త ప్లేయ‌ర్ ఆడుతున్నాడంటూ ట్రోలింగ్‌

IND VS PAK, Final: ఫైన‌ల్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌..అభిషేక్ శర్మ, పాండ్యా ఔట్ ?

Big Stories

×